Homeఎంటర్టైన్మెంట్Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునకు, ఆయన అన్నకి మధ్య నిజంగానే మాటలు లేవా? ఆస్తులే కారణమా?

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునకు, ఆయన అన్నకి మధ్య నిజంగానే మాటలు లేవా? ఆస్తులే కారణమా?

Akkineni Nagarjuna: ఆస్తి విషయంలో ఎంత మంచి అన్నదమ్ములు అయినా అక్కచెల్లెల్లు అయినా గొడవలు పడుతుంటారు. ఇలాంటి విషయాలు మధ్యతరగతి కుటుంబాలలో మాత్రమే కాదు ధనవంతుల కుటుంబాలలో కూడా జరుగుతాయి. అంతే కాదు సినీ సెలబ్రెటీల కుటుంబాలలో కూడా ఇలాంటి విషయాల్లో గొడవలు వస్తుంటాయి. కానీ అలాంటి విషయాలను బయటకు రానివ్వరు సెలబ్రెటీలు. ఈ గొడవ అక్కినేని నాగార్జున వరకు కూడా పాకిందట. ఇంతకీ ఈ కుటుంబంలో ఎవరి మధ్య గొడవ మొదలు అయింది అనుకుంటున్నారా?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కు తన అన్న అక్కినేని వెంకట్ కు మధ్య ఆస్తి విషయంలో తగాదాలు వచ్చాయని, ఇద్దరి మధ్య కనీసం మాటలు కూడా లేవు అంటూ ఎప్పటి నుంచో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే అక్కినేని నాగేశ్వరరావు కు నాగార్జున ఒక్కడే కొడుకు అని అనుకుంటారు. కానీ నాగార్జునకు వెంకట్ అనే అన్నయ్య కూడా ఉన్నారు. ఈయన ఇండస్ట్రీలో నిర్మాతగా రాణిస్తున్నారు. ఇక నాగార్జున సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఈయన అందరికీ తెలుసు.

గత కొద్ది రోజులుగా వీరి మధ్య మాటలు లేవని, ఆస్తి విషయంలో గొడవలు పడ్డారని టాక్. అయితే ఈ విషయంపై అక్కినేని వెంకట్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరు అక్కినేని నాగేశ్వరరావు ముందు ఏ రోజు కూడా మాటైనా మాట్లాడేవారు కాదట. ఏదైనా మాట్లాడితే చాలా భయపడేవారట. ఒక రోజు వెంకట్ ధైర్యం చేసుకొని నాన్న.. నాగార్జునను హీరో చేద్దాం అన్నారట. దానికి నాగేశ్వర రావు కూడా ఒకే చెప్పారట. దీని గురించి మాట్లాడుతూనే నాగార్జునకు నాకు మధ్య ఏ గొడవలు లేవని తెలిపారు.

మా మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని, మేము మాట్లాడుకోవడం లేదని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు వెంకట్. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు అన్నీ కూడా నాగార్జునే చూసుకుంటున్నారని వెంకట్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు జనరేషన్ గ్యాప్ వస్తుందని సినిమాలు నిర్మించడం కూడా మానేశారట. మొత్తం మీద వీరిద్దరి మధ్య మాటలు లేవని, ఆస్తుల కోసం గొడవలు జరిగాయనే వార్తలకు పులిస్టాప్ పడినట్టుగా అయింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version