https://oktelugu.com/

Balakrishna And Chiranjeevi: బాలయ్య చిరంజీవి కాంబో లో సినిమా సెట్ చేయడానికి ఇద్దరు డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నారా..?

చిరంజీవి బాలయ్య ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది అయితే ఏమి లేదు. ఎందుకంటే వీళ్లిద్దరూ ఇండస్ట్రీ కి రెండు పిల్లర్లుగా నిలబడ్డారు...గత 40, 50 సంవత్సరాల నుంచి వాళ్ల వంతు సేవ ను చేసుకుంటూ వస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 03:41 PM IST

    Balakrishna And Chiranjeevi

    Follow us on

    Balakrishna And Chiranjeevi: ఒకప్పుడు చిరంజీవి తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు చిరంజీవికి పోటీని ఇస్తూ వచ్చిన మరొక హీరో నందమూరి బాలకృష్ణ…వీళ్ళిద్దరూ మాస్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకోవడమే కాకుండా వాళ్ల సినిమాలతో పోటీపడి మరి ఒకరి మీద మరొకరు పై చేయి సాధిస్తూ వచ్చారు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు క్లాస్ సినిమాలు చేసుకుంటూ వస్తే చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు మాత్రం మాస్ లో ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే వీళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇలాంటి సందర్భంలో వీళ్ళ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా చేయాలని అప్పట్లో దర్శక నిర్మాతలు చాలా వరకు ఆసక్తి చూపించినప్పటికీ వాళ్ళు ఇమేజ్ కి సరిపడా కథ అయితే దొరకలేదు. దాని వల్ల అటు బాలయ్య, ఇటు చిరంజీవి ఇద్దరు కూడా ఆ సినిమా మీద పెద్దగా ఆసక్తి అయితే చూపించలేకపోయారు.

    కానీ ఇప్పుడున్న జనరేషన్ లో మల్టీ స్టారర్ సినిమాలకు మంచి గిరాకీ ఉండటం వల్ల వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళ కాంబోలో సినిమా వస్తే భారీ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

    ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా బాలయ్య బాబు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు గడిచిన సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ కలిసి బాలయ్య బాబుకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి బాలయ్య గురించి చాలా బాగా మాట్లాడారు. ఒకే సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి నటించడానికి సుముఖంగా ఉన్నామని దర్శకులు కథలు రెడీ చేయడమే ఆలస్యం మేము సినిమా చేస్తామని బాలయ్య బాబు చిరంజీవి ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు కొంత మంది దర్శకులు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా చేయడానికి కథలని రెడీ చేస్తున్నారు.

    అందులో ముఖ్యంగా బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ లాంటి దర్శకుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి కమర్షియల్ సినిమాలని తెరకెక్కించడం లో చాలా మంచి పేరు ఉంది. దానివల్లే వాళ్ల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తు కథ ను రెడీ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే చిరంజీవి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మరి మంచి కథలు రెడీ చేయగలిగే దర్శకులు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నేపథ్యంలో వీళ్ళ కాంబో చాలా ఈజీగా సినిమా వర్కౌట్ అవుతుంది అంటు మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఫ్యూచర్లో అయిన వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనేది…