https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం ప్రొడ్యూసర్స్ కి నిరీక్షణ తప్పదా..? ఇంకా ఎన్ని రోజులు…

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే అందరికి ముందుగా మెగా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ హీరోలు ఇండస్ట్రీలో ఒక చెరగని ముద్ర వేస్తూ చాలా సంవత్సరాల పాటు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి దాదాపు ముగ్గురు స్టార్ హీరోలు ఉండటం విశేషం...ఇక వాళ్లందరూ చేస్తున్న సినిమాలతో ఒకే సంవత్సరంలో సినిమాలను రిలీజ్ చేస్తూ భారీ కలెక్షన్లను కొల్లగొడుతూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒంటి చేత్తో ముందుకు తీసుకెళుతున్న ఘనత కూడా వీళ్ళకే దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 11:11 AM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అంత ఇంత కాదు. ప్రతి ఒక ప్రేక్షకుడిని తన మేనరిజంతో మెస్మరైజ్ చేసి తన వైపు తిప్పుకున్న క్రెడిట్ కూడా పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది. అలాంటి ఒక స్టార్ డమ్ ను సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. కాబట్టి తను సెట్స్ మీద ఉంచిన సినిమాలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఆయా సినిమాల ప్రొడ్యూసర్స్ మాత్రం పవన్ కళ్యాణ్ రాక కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాల మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ కి సంబంధించిన ఫైనాన్సర్స్ వారిని భారీగా ఇబ్బందులు పెడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

    మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఆయా ప్రొడ్యూసర్లకు ఎలాంటి సమాధానం చెబుతూ సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. నిజానికైతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆ సినిమాలను పూర్తి చేయాల్సింది.

    కానీ ఎలక్షన్స్ రావడం అందులోనూ పవన్ కళ్యాణ్ పార్టీ ఘన విజయం సాధించడం ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను స్వీకరించాడు. తద్వారా అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ కి సినిమాలు చేసే తీరిక అయితే లేదు.

    నిజానికి ఎలక్షన్స్ కి ముందే ఆ సినిమాలని కంప్లీట్ చేసి తను రంగంలోకి దిగితే బాగుండేది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సెట్స్ మీద ఉంచిన మూడు సినిమాల పరిస్థితి ఏంటి ఆ ప్రొడ్యూసర్లు ఎలా ఇబ్బందులు పడుతున్నారనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…