https://oktelugu.com/

NTR : ఎన్టీయార్ విషయంలో ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారా..?అందుకే డ్రాగన్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కి మెసేజ్ లు పెడుతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 1, 2025 / 05:32 PM IST

    NTR

    Follow us on

    NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇలాంటి నటుడు సైతం పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రియేషన్ క్రియేట్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా రాబోయే సినిమాలతో ఆయన సూపర్ డూపర్ సక్సెస్ లో సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం తన తోటి హీరోలందరూ పాన్ ఇండియాలో ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ ఆ విషయంలో కొంతవరకు వెనుకబడ్డాడనే చెప్పాలి. ఇక మీదట వచ్చే సినిమాలతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన దైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆయనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టి ఆయనతో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాకి మ్యుజిక్ డైరెక్టర్ గా రవి బసురూరు వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికీ కే జి ఎఫ్ లాంటి సినిమాలకు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందనే చెప్పాలి.

    మరి ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రవి బసురుర్ కి కొన్ని మెసేజ్ లైతే పెడుతున్నారు. అన్నా నువ్వు మ్యూజిక్ ఎలా ఇచ్చినా పర్లేదు. కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఇవ్వాలని నువ్వు ఇచ్చే బ్యా గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్ మొత్తం హైలెట్ గా నిలవాలని వాళ్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, రవి బసురుర్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ విల్లిద్దరినీ బాగా నమ్మాడు. కాబట్టి తన నమ్మకం నిలబెట్టే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా వాళ్లతో భారీ సక్సెస్ ని సాధించి పెట్టాలని ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    డ్రాగన్ సినిమాలో కూడా భారీ ఎలివేషన్స్ ఉండేలా సీన్స్ రాసుకున్నారట. మరి ఆ ఎలివేషన్స్ వర్కౌట్ అవుతాయా తద్వారా ఎన్టీఆర్ ఎలాంటి మాస్ హీరోగా అవతరించబోతున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాలేదు. కాబట్టి మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను ఏ స్టాండర్డ్ లో నిలబెడతాదు అనేది కూడా తెలియాల్సి ఉంది…