Anushka : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో అనుష్క శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కెరీర్ స్టార్టింగ్ లో గ్లామర్ పాత్రలలో నటించినప్పటికీ ఆ తర్వాత అనుష్క శెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో సోలో లీడ్ గా నటించింది. ఇప్పటివరకు ఆమె తన కెరీర్లో చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అయితే ఈమె నటించినా సినిమాలలో అరుంధతి సినిమాకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాలో అనుష్క శెట్టి సోలో లీడ్ గా నటించింది. అరుంధతి సినిమా తర్వాత అనుష్క శెట్టి ప్రత్యేకమైన పాత్రలు ఉన్న సినిమాలలో మాత్రమే కనిపించింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా బాహుబలి లో కూడా దేవసేన పాత్రలో అద్భుతంగా నటించింది అనుష్క. ఇక ఆ తర్వాత ఆమె సైజ్ జీరో సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించింది. సైజ్ జీరో సినిమా వచ్చిన చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అనుష్క శెట్టి 2023లో మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అనుష్క శెట్టి ని గ్రాఫిక్స్ చేశారని పలు వార్తలు కూడా వినిపించాయి. ప్రస్తుతం ఈమె రెండు తెలుగు సినిమాలతో పాటు ఒక మలయాళం సినిమాలో కూడా నటిస్తుంది. తాజాగా అనుష్క శెట్టి ఇంస్టాగ్రామ్ కు సంబంధించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. అనుష్క శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఈమెకు ఇంస్టాగ్రామ్ లో 7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఈమె మాత్రం ఇంస్టాగ్రామ్ లో కేవలం 12 మందిని మాత్రమే ఫాలో అవుతుంది. ఆ 12 మందిలో కేవలం ఇద్దరూ తెలుగు హీరోలు మాత్రమే ఉండడం విశేషం. అయితే ఆ ఇద్దరు తెలుగు హీరోలలో ప్రభాస్ మాత్రం లేడు. ఒకప్పుడు ప్రభాస్, అనుష్క సీక్రెట్ గా ప్రేమాయణం సాగిస్తున్నారని అలాగే త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా వార్తలు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. కానీ ప్రభాస్ ను మాత్రం అనుష్క ఫాలో అవ్వడం లేదు. మరీ ఇంస్టాగ్రామ్ లో స్వీటీ ఫాలో అవుతున్న వాళ్లు ఎవరంటే పీవీ సింధు, రాజమౌళి, కృషి శెట్టి, కాజల్ అగర్వాల్. వీళ్ళతోపాటు రానా, దుల్కర్ సల్మాన్లను అనుష్క ఫాలో అవుతుంది.
43 ఏళ్లు దాటిన ఇంకా ఈ అమ్మడు పెళ్లి చేసుకోలేదని తెలుస్తుంది. అనుష్క శెట్టి ఇప్పటివరకు తన కెరీర్లో సౌత్ సినిమాలతో పాటు హిందీలో కలిపి దాదాపు 48 సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది ఈ బ్యూటీ. తన మొదటి సినిమాకు రూ. 10 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్న అనుష్క శెట్టి ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.