Star Directors: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకొని హీరోలకు భారీ సక్సెస్ లను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు హీరోలా ఇమేజ్ ని బేస్ చేసుకుని ఆయన సినిమాలు చేయడంలో దిట్ట… ఇక రాజమౌళి , సుకుమార్ , వినాయక్ లాంటి డైరెక్టర్స్ కూడా మన స్టార్ హీరోలకి సూపర్ సక్సెస్ లను అందించారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ దర్శకుల దగ్గర పనిచేసిన వాళ్లలో ఎంతమంది ఇండస్ట్రీకి డైరెక్టర్స్ గా పరిచయం అయ్యారు. దాంట్లో ఎంత మంది సక్సెస్ అయ్యారు ఎవరెవరు ఫేడ్ అవుట్ అయ్యారు అనే విషయాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్ దగ్గర వర్క్ చేసి దర్శకులుగా మారిన వాళ్లలో హరీష్ శంకర్, పరుశురాం, మెహర్ రమేష్ లాంటి దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు. ఇక వాళ్లలో హరీష్ శంకర్, పరశురాం సక్సెస్ ఫుల్ దర్శకులుగా ముందుకు సాగుతుంటే మెహర్ రమేష్ మాత్రం ఫెయిల్యూర్ డైరెక్టర్ గా ఫేడ్ అవుట్ అయిపోయాడు…
రాజమౌళి
రాజమౌళి దగ్గర పనిచేసిన వాళ్లలో కరుణ కుమార్, త్రికోటి లాంటి దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయినప్పటికీ వీళ్ళలో ఎవరు కూడా సక్సెస్ ఫుల్ దర్శకుడి గా పేరు సంపాదించుకోలేకపోయారు…
సుకుమార్
సుకుమార్ దగ్గర నుంచి వచ్చిన దర్శకుల్లో బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల, పల్నాటి సూర్య ప్రతాప్, కార్తీక్ దండు లాంటి దర్శకులు ఉన్నారు. ఇక ప్రస్తుతం వీళ్ళు నలుగురు కూడా మంచి దర్శకులుగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రి లో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు…
వి వి వినాయక్
ఈయన దగ్గర వర్క్ చేసి దర్శకులుగా మారిన వాళ్లలో వశిష్ఠ ఒకరు. ప్రస్తం ఈయన మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే బింబిసారా లాంటి సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈయన ఇప్పుడు చిరంజీవితో విశ్వం భర అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈయన తర్వాత వీడు తేడా అనే సినిమాతో చిన్ని కృష్ణ కూడా ఇదర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయినప్పటికీ ఈయన పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయాడు… ఇక కందిరీగ సినిమా తో డైరెక్టర్ అయిన సంతోష్ శ్రీనివాస్ కూడా మొదట ఈయన దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాడు. ఈయన కూడా ఒకటి రెండు హిట్లతో మెరిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోయాడు…