సినీ కార్మికుడితో హీరో కూతురు ప్రేమాయణం !

సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఎలాంటి విలువ లేని ఒక సినీ కార్మికుడు లాంటి వాడు. మరి అలాంటి పోస్ట్ లో ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను ఒక స్టార్ హీరో కుమార్తె మరియు ప్రముఖ హీరోయిన్ ప్రేమించడం అంటే అది కచ్చితంగా అతిశయోక్తి. కానీ, సీనియర్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ బేటీ ‘సారా అలీ ఖాన్’ ఆ అతిశయోక్తిని నిజం చేసి చూపించింది. భారీ హిట్స్ లేకపోయినా సారాకి మంచి […]

Written By: admin, Updated On : September 14, 2021 11:25 pm
Follow us on

సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఎలాంటి విలువ లేని ఒక సినీ కార్మికుడు లాంటి వాడు. మరి అలాంటి పోస్ట్ లో ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను ఒక స్టార్ హీరో కుమార్తె మరియు ప్రముఖ హీరోయిన్ ప్రేమించడం అంటే అది కచ్చితంగా అతిశయోక్తి. కానీ, సీనియర్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ బేటీ ‘సారా అలీ ఖాన్’ ఆ అతిశయోక్తిని నిజం చేసి చూపించింది. భారీ హిట్స్ లేకపోయినా సారాకి మంచి స్టార్ డమ్ వచ్చింది.

మరి అలాంటి హీరోయిన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించడం ఏమిటి ? బాలీవుడ్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ‘కేదార్‌నాథ్‌’ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది సారా. ఈ సినిమాలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరో. సారా, సుశాంత్ సరసన హీరోయిన్‌గా నటిస్తూ అతనితో ప్రేమలో పడింది. సుశాంత్‌, సారా డేటింగ్‌ కూడా చేశారు.

ఆ తర్వాత సుశాంత్ కి సారాకి మధ్య గ్యాప్ వచ్చింది. దాంతో సారా యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ తో కొన్నాళ్ళు పాటు ప్రేమాయణం నడిపింది. వీళ్లిద్దరిదీ విడదీయరాని అనుబంధం అని కూడా కథనాలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో అతనికి కూడా సారా హ్యాండ్ ఇచ్చింది. ప్రస్తుతం సారా కేదార్‌నాథ్‌ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసిన ‘జెహన్‌ హండా’తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది.

సముద్ర తీరాన జెహన్‌ హండాతో సారా ఫుల్ గా ఎంజాయ్‌ చేస్తూ ఫోటోలు దిగింది. పైగా ఆ ఫోటోలను సారానే స్వయంగా తన ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేస్తూ ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. ‘లవ్‌ యూ.. నన్ను మళ్లీ నువ్వు అక్కడకు తీసుకెళ్లిపో’ అని ఏదో తియ్యని జ్ఞాపకాలలో తేలిపోతూ ఇలా రాసుకొచ్చింది. ఇక సారా పోస్ట్ చేసిన ఫొటోలో సారా అతడిపై వాలిపోవడం చూస్తుంటే.. వ్యవహారం బాగా ముదిరిపోయిందని అర్ధం అవుతుంది. సారా అతన్ని ప్రేమించడానికి కారణం.. అతని దగ్గర ఉంటే ఆమెకు పూర్తి సంతోషం దొరుకుతుందట.