Koratala Shiva: దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా సరే తన సత్తా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఈ సినిమా మీద ఆయన భారీ అంచనాలను పెట్టుకొని మరీ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకుల్ని అలరించగా, మరి కొంతమందికి మాత్రం ఆ ట్రైలర్ అయితే నచ్చలేదు. ఇక దాంతో సోషల్ మీడియాలో ఆయన మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే ఏర్పడుతుంది. అలాగే అతన్ని తీవ్రంగా ట్రోల్ అయితే చేస్తున్నారు. తన గత చిత్రం అయిన ఆచార్య పాదఘట్టం అయితే దేవర సముద్ర ఘట్టం అవుతుంది అంటూ విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే కొరటాల శివ తనదైన రీతిలో పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకుంటాడు. లేకపోతే మాత్రం ఫెయిల్యూర్ డైరెక్టర్ గానే మిగిలి పోవాల్సి ఉంటుందనే కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక ఇప్పుడు దేవర సినిమా స్టోరీని కనక చూసినట్లయితే తండ్రి కొడుకుల మధ్య ఉండే ఒక ఎమోషన్ ని కనెక్ట్ చేస్తూ అక్కడ పీడిత ప్రాంత ప్రజలను కాపాడడమే హీరో లక్ష్యంగా కనిపిస్తుంది.
ఇక ఈ స్టోరీ లైన్ కనక మనం చూసినట్లైతే గత 20 సంవత్సరాలు నుంచి ఇదే పాయింట్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చాయి. కాబట్టి కొరటాల శివ కథలు ఔట్ డేటెడ్ అయిపోయయా? ఆయన అలాంటి కథలను మాత్రమే రాయగలడా? అంటూ సినీ విమర్శకులు సైతం కొంతవరకు అతన్ని విమర్శిస్తున్నారు. మరి మొత్తానికైతే ఆయన చేయబోయే సినిమాలు ఎలా ఉంటాయి అనే విషయం పక్కన పెడితే దేవర సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది మాత్రమే ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వినిపిస్తుంది.
ఇక ఈనెల 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపధ్యంలో సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ అది కేవలం ఎన్టీఆర్ ను చూసి మాత్రమే అలాంటి అంచనాలు ఉన్నాయని కొరటాల శివ మీద ఎవరికి నమ్మకం లేదని భావనలైతే వెలుబడుతున్నాయి. ఇక ఈ సినిమాతో కొరటాల శివ ఎలాంటి మ్యాజిక్ ని చేస్తాడు. సూపర్ సక్సెస్ ని అందుకొని మరో స్టార్ హీరోని లైన్ లో పెడతాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…