Coolie Movie Inside Reports: ప్రస్తుతం సౌత్ ఇండియా లో యూత్ ఆడియన్స్ మొత్తం ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘కూలీ'(Coolie Movie). సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం తో పాటు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్(Aamir Khan), కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(Nimma Upendra) వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమా పై అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రతీ చోట బిజినెస్ వేరే లెవెల్ లో జరిగింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిందంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాకు సంబందించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
అదేమిటంటే రీసెంట్ గానే ఈ సినిమా తోలి కాపీ ని చెన్నై లోని ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ లో కొంతమంది మీడియా ప్రముఖులకు వేసి చూపించారట. వీళ్లంతా ముంబై కి చెందిన విలేఖరులు అని సమాచారం. వీళ్ళు ఈ సినిమాని చూసిన తర్వాత సంతృప్తి గా లేరనే టాక్ చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఒక మోస్తారు గా ఉందని, సెకండ్ హాఫ్ సినిమా పూర్తిగా గాడి తప్పిందని, లోకేష్ కనకరాజ్ మార్క్ కనిపించలేదని అంటున్నారు. అయితే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున నటన మాత్రం చాలా గొప్పగా ఉందని, ఆయన పాత్ర గురించి గొప్పగా మాట్లాడుకుంటారని అంటున్నారు. సినిమా నిజంగా ఆ విధంగా ఉంటే లోకేష్ కెరీర్ లో మొట్టమొదటి ఫ్లాప్ గా ఈ చిత్రం నమోదు అయ్యే అవకాశం ఉంది. అయితే లోకేష్ గత చిత్రం ‘లియో’ కి కూడా ఇలాగే పబ్లిక్ నుండి నెగెటివ్ టాక్ వచ్చింది.
Also Read: రియల్ కుంభకోణం.. స్టార్ హీరో మహేష్ బాబుకు మరో నోటీసులు.. టాలీవుడ్ లో కలకలం!
కానీ ఆ సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ట్రేడ్ కూడా ఆశ్చర్యపోయే రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 2023 వ సంవత్సరం లో రజనీకాంత్ జైలర్ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడం వల్ల 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ లియో చిత్రానికి డివైడ్ టాక్ మీద 650 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. ఇదే మ్యాజిక్ ‘కూలీ’ విషయం లో కూడా రిపీట్ అవుతుందని,కాబట్టి అభిమానులు రిలాక్స్ అవ్వొచ్చని అంటున్నారు. మరి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. లియో చిత్రం లో మాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. కానీ కూలీ నుండి మొన్న రిలీజ్ అయిన పాటకు గొప్ప రెస్పాన్స్ రాలేదు. రాబోయే కంటెంట్లు ఎలా ఉండబోతున్నాయి చూడాలి.