Homeఎంటర్టైన్మెంట్Bollywood Vs Tollywood Box Office Competition: మరోసారి బాలీవుడ్ హీరోలను తక్కువ అంచనా వేస్తున్నారా..?

Bollywood Vs Tollywood Box Office Competition: మరోసారి బాలీవుడ్ హీరోలను తక్కువ అంచనా వేస్తున్నారా..?

Bollywood Vs Tollywood Box Office Competition: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించిన హీరోకి క్రేజ్ భారీ రేంజ్ లో మార్కెట్ ఉంటుంది. వాళ్ల నుంచి వచ్చిన సినిమాలను ప్రేక్షకులు అలరించడమే కాకుండా వాళ్ళు కనిపిస్తే చాలు వాళ్ళతో ఫోటోలు దిగడానికి కూడా ఎగబడిపోతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన హీరోలు గత 10 సంవత్సరాల క్రితం వరకు తెలుగు సినిమాలకే పరిమితమయ్యారు. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి పాన్ ఇండియా స్థాయిలో మన హీరోలు సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఇక ఇప్పటివరకు మన హీరోలు టాప్ లో ఉండాలనే ఆలోచిస్తున్నారు. కానీ బాలీవుడ్ హీరో అయిన రణ్వీర్ సింగ్ దూరంధర్ సినిమాతో సైతం 1000 కోట్ల మార్కెట్ ను దాటేశాడు. కాబట్టి బాలీవుడ్ హీరోలు మరోసారి ఊపందుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి సందర్భంలో వారిని తక్కువ అంచనా వేసి చూడకూడదు.

Also Read: నాని పొజిషన్ లో ఉండాల్సిన శర్వానంద్ డౌన్ ఫాల్ అవ్వడానికి కారణమేంటి..?

మన ప్రయత్నంలో మనం ఉండాలి అలాగే వాళ్ళ కంటే బెటర్ సినిమాలను చేసి సూపర్ హిట్లను సాధించడానికి తీవ్రమైన కృషి చేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా మళ్లీ మన హీరోలు బీట్ చేసి వాళ్ళ ముందుకు దూసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది…కాబట్టి ప్రతి విషయంలో మన వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం మన హీరోలను, దర్శకులను హెచ్చరిస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు. తద్వారా వీళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఖాన్ త్రయం పని అయిపోయినప్పటికి నెక్స్ట్ జనరేషన్ బాలీవుడ్ హీరోలందరు కూడా మంచి కాన్సెప్ట్ లను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు.

కాబట్టి మన హీరోలు సైతం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను చేస్తూ తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది… ఇక ఏది ఏమైనా కూడా ఇండియాలో ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు మన హీరోల వైపే మొగ్గుచూపుతున్నారు. మన వాళ్ళతో సినిమాలను చేస్తే వాళ్లకు కూడా గొప్ప పేరు వస్తుందని ఆలోచిస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular