Bigg Boss 9 Telugu Eliminations: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకుంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే టెలివిజన్ రంగంలో వచ్చే చాలా షో లు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఇలాంటి క్రమం లోనే బిగ్ బాస్ షో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఈ షో ఇప్పుడు ఇండియాలోనే టాప్ టిఆర్పి రేటింగ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ 9 షో స్టార్ట్ అయి 15 రోజులు అవుతున్న క్రమంలో ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేశారు. ఇక మొదట శ్రష్టి వర్మ ఈ షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికి సెకండ్ వారంలో మర్యాద మనీష్ ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మర్యాద మనీష్ హౌస్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అందరితో కలివిడిగా ఉంటాడు. అయిన కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తూ ఉంటాడు.
మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకని షో నుంచి తీసేసారు అసలు షో లో బాగా ఆడేవారిని తీసేస్తున్నారు అంటూ ఒక టాక్ అయితే వస్తోంది…ఈ ఎలిమినేషన్ ప్రక్రియను ఎలా చేపడుతున్నారన్న విషయంలో పూర్తి క్లారిటి లేనప్పటికి వాళ్లకు నచ్చిన వారిని మాత్రం చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిజానికి ఫ్లోరా షైనీ పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు ఆమె పని ఆమె చేసుకుంటుంది తప్ప బిగ్ బాస్ హౌజ్ లో ఆమె పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం లేదు.
ఆమె ఈ షో నుంచి వెళ్ళిపోతుందని అందరు అనుకున్నారు. కానీ అందరికి షాకిస్తూ మనీష్ ను తీసేయడం పట్ల కొంతమంది కొన్ని రకాల అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. మరి బిగ్ బాస్ షో ఎవరికి ఫేవర్ గా ఉండదు అని చెబుతూనే కొంతమందికి ఫేవర్ గా మారబోతోందా అనే వార్తలు కూడా వస్తున్నాయి… మరి ఫ్యూచర్ లో బిగ్ బాస్ సీజన్ 9 లో ఇంకా ఎన్ని మార్పులను చేస్తారు. ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది…