AR Rahman: తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ బతుకమ్మ. ప్రకృతిని ఆరాధిస్తూ చేసే వేడుకను అందరు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఇల్లు లోగిలిగా మారుతుంది. సంప్రదాయబద్దంగా జరుపుకునే పండుగలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేస్తారు. బతుకమ్మ పండగకు మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. రాష్ర్టంలో జరిగే అన్నిపండుగలలో బతుకమ్మది ప్రత్యేక స్థానం.

ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు కొత్త పాటలు ఆవిష్కరించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ సంగీత దర్శకత్వంలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, బృంద కొరియోగ్రఫీలో రచయిత మిట్లపల్లి సురేందర్ సాహిత్యంలో నిర్మాణం జరిగింది. ఈ పాట నేడు ఆవిష్కరించనున్నారు. దీంతో దీనిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
బతుకమ్మ పాటలతో తెలంగాణలో సందడి నెలకొంటుంది. బతుకమ్మ గీతాలతో మహిళలు నృత్యం చేస్తూ అందరిని వినోదంలో ముంచెత్తుతారు. కొద్ది రోజులుగా బతుకమ్మ పాటలకు బాగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెహమాన్ సంగీతంలో రూపుదిద్దుకుంటున్న పాట కోసం శ్రోతల్లో ఆసక్తి ఏర్పడింది.
బతుకమ్మ విశిష్టతను పాట రూపంలో వినవచ్చని తెలుస్తోంది. మిట్టపల్లి సురేందర్ సాహిత్యం ఏ మేరకు ప్రజలను ఆకట్టుకుంటుందోనని అందరు ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు గౌతమ్ మీనన్ టేకింగ్ బృంద వేసిన స్టెప్పులపై అందరిలో ఒకటే ఆతృత నెలకొంది. బతుకమ్మ సాంగ్ పై అందరిలో అంచనాలు పెరిగిపోయాయి.