https://oktelugu.com/

ఏప్రిల్ తెలుగు సినిమాల రివ్యూ !

ఏప్రిల్ నెల టాలీవుడ్ కు ఎంతవరకు కలిసి వచ్చిందో.. ఒకసారి బాక్సాఫీస్ లెక్కలు చూసుకుంటే.. ఘనంగా మొదలై.. నీరసంగా ముగిసింది. నెల మధ్యలో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో మళ్లీ మొదటికి వచ్చింది సినిమాల రిలీజ్ పరిస్థితి. నిజానికి వకీల్ సాబ్ ఓపెనింగ్స్ చూసిన తరువాత ఇక ఏప్రిల్ నెల నుండి గత వైభవాన్ని చూడబోతున్నాం, రాబోయే టక్ జగదీష్, లవ్ స్టోరీ, విరాటపర్వం లాంటి సినిమాలకు ఇక తిరుగు ఉండదు అని సినిమా జనం భావించారు. […]

Written By:
  • admin
  • , Updated On : May 1, 2021 / 09:21 AM IST
    Follow us on

    ఏప్రిల్ నెల టాలీవుడ్ కు ఎంతవరకు కలిసి వచ్చిందో.. ఒకసారి బాక్సాఫీస్ లెక్కలు చూసుకుంటే.. ఘనంగా మొదలై.. నీరసంగా ముగిసింది. నెల మధ్యలో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో మళ్లీ మొదటికి వచ్చింది సినిమాల రిలీజ్ పరిస్థితి. నిజానికి వకీల్ సాబ్ ఓపెనింగ్స్ చూసిన తరువాత ఇక ఏప్రిల్ నెల నుండి గత వైభవాన్ని చూడబోతున్నాం, రాబోయే టక్ జగదీష్, లవ్ స్టోరీ, విరాటపర్వం లాంటి సినిమాలకు ఇక తిరుగు ఉండదు అని సినిమా జనం భావించారు.

    కట్ చేస్తే.. ఇదే ఏప్రిల్ నెలలో కళకళలాడిన బాక్సాఫీస్, మళ్లీ దిక్కు లేని దానిలా మూత పడిపోయింది. పైగా రోజురోజుకూ పెరుగుతున్న కరోనా ప్రభావంలో అసలు థియేటర్ల పై కమ్ముకున్న కరోనా నీడలు ఎప్పటికి విడతాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో కరోనా విలయతాండవం మొదలైనా ఏప్రిల్ మూడో వారంలో కూడా థియేటర్లను తెరిచే ఉంచారు. కేవలం వకీల్ సాబ్ కోసం కొన్ని తెరిచిపెట్టారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.

    కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా లేకుండా పోయాయి. పవన్ సినిమాకే ఖాళీ సీట్లు కనిపిస్తుంటే.. మధ్యలో కొన్ని చిన్న సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. అంతకుముందు అనగా ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో యువరత్న, వైల్డ్ డాగ్, సుల్తాన్ లాంటి సినిమాలు రిలీజ్ అయినా, బాక్సాఫీస్ వద్ద కనీస ప్రభావం చూపలేకపోయాయి. నాగ్ ఎంతో కష్టపడి చేసిన వైల్డ్ డాగ్ సినిమాకి కలెక్షన్స్ రాలేదు. పైగా ఎప్పుడూ లేనిది నాగ్ ఈ సినిమా కోసం వైల్డ్ ప్రమోషన్స్ చేశాడు. ఆయినా.. జనం పట్టించుకోక పోవడం విచిత్రం.

    ఏది ఏమైనా మంచి సినిమాలతోనే ఏప్రిల్ నెల మొదలైనా ఒక్క వకీల్ సాబ్ సినిమా తప్ప, మరో ఏ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఏప్రిల్ 9న వచ్చిన వకీల్ సాబ్ సినిమా మొత్తమ్మీద పవన్ కల్యాణ్ కి అదిరిపోయే కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైనా ఆ అంచనాలకు తగ్గట్టు తెలుగు రాష్ట్రాల్లో అత్యథిక థియేటర్లలో అత్యద్భుతమైన ఓపెనింగ్స్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది.

    నిజానికి వకీల్ సాబ్ కలెక్షన్స్ చూసిన తరువాతే.. చిన్నాచితకా సినిమాలన్నీ రిలీజ్ క్యూ కట్టాయి. అందులో రాజశేఖర్-రామ్ గోపాల్ వర్మ ‘దెయ్యం’తో పాటు టెంప్ట్ రాజా, చెక్ మేట్, 99 సాంగ్స్, చిట్టిబాబు, ఇట్లు అంజలి, శుక్ర, కథానిక ఇలా వరుస సినిమాలు వరుసపెట్టి థియేటర్లలోకి వచ్చినా.. ఒక్క సినిమా కూడా బాక్సాపీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించలేక చేతులెత్తేసింది. మొత్తంగా ఏప్రిల్ ఒక్క పవన్ ఫ్యాన్స్ కి తప్ప, మరో ఏ సినిమా వ్యక్తికి ఆనందాన్ని ఇవ్వలేదు.