Hero Vishal : తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశాల్ (vishal)… ప్రస్తుతం ఆయన మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా జరిగిన ‘మదగజరాజ’ (madagaja raja) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించిన ఆయనను చూసి చాలామంది సినిమా అభిమానులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చాలా సన్నబడిపోయి, వణుకుతూ అసలు ఏమాత్రం నిలబడేంత ఎనర్జీ (Enargy) కూడా లేకుండా వీక్ అయిపోయిన ఆయనను చూసి అతని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకు అంటే ఆయన ఎందుకని అలా అయ్యారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంతకుముందు చాలా స్ట్రాంగ్ గా ఉండే ఆయన ఇప్పుడు ఎందుకు అలా అయిపోయారు అంటూ తీవ్రమైన మనస్థాపానికి గురయ్యారు. మరి మొత్తానికైతే చెన్నై అపోలో (apolo) ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు ఆయన హెల్త్ పట్ల స్పందించారు.ఆయన గత కొద్దిరోజుల నుంచి పూర్తిగా వైరల్ ఫీవర్ (viral fevar) తో బాధపడుతున్నారని విపరీతమైన ఫీవర్ తో పాటు ఆయన కాళ్లు చేతులు వణకడం లాంటివి జరుగుతున్నాయి. ఇక కొద్ది రోజులపాటు ఆయన కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన స్పందించారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన అభిమానులు వాళ్ల హీరోకి అలా అవ్వడం పట్ల కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా తొందర్లోనే ఆయన కోలుకొని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను అందుకోవాలని అతని అభిమానులతో పాటు యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరు కూడా కోరుకుంటూ ఉండటం విశేషం…
మరి ఇది ఏమైనా కూడా ఆయనకి ఇక మీదట చేయబోయే సినిమాలు మంచి విజయాలను సాధిస్తే ఆయన మరోసారి స్టార్ హీరోగా వెలుగొందుతాడు లేకపోతే మాత్రం ఆయన కెరియర్ డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు ఏమీ పెద్దగా ఆడకపోవడంతో సగటు హీరోకి ఉండే మార్కెట్ కూడా అతనికి లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే మంచి విజయాన్ని అందుకొని తనను తాను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇక విశాల్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా అతని సినిమాలు డబ్ అవుతూ ఉంటాయి.
కాబట్టి ఇక్కడ కూడా ఆయనకు మంచి మార్కెట్ అయితే ఉంది. మరి ఇప్పటివరకు ఆయన తెలుగులో ఒక స్స్ట్రైయిట్ సినిమా కూడా చేయలేదు. తొందర్లోనే స్ట్రైయిట్ సినిమా చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తెలుగు సినిమా డైరెక్టర్లతో కూడా ఇంతకుముందు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది…