Movie ticket prices issue: తెలుగు చిత్ర పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు అంటుంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం అనే కంటే ‘జగన్ వదిలేలా లేడు’ అనడం కరెక్ట్ ఏమో. అసలు తన ప్రభుత్వం నుంచి వచ్చిన జీవో నెం.35ను హైకోర్టు రద్దు చేయడం ఏమిటి ? పైగా తమ నిర్ణయాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ సింపుల్ గా తేల్చి పడేస్తోందా ? అంటూ జగన్ ఇగో హర్ట్ అయిందట. అందుకే, ఇప్పుడు ఈ టికెట్ రేట్ల విషయాన్ని జగన్ ఇంకా సీరియస్ గా తీసుకున్నారు.

హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పు పడుతూ.. హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేయడానికి తగిన విధంగా కసరత్తులు మొదలుపెట్టారు. దాంతో స్వయంగా అడ్వకేట్ జనరలే రంగంలోకి దిగాల్సి వచ్చింది. తక్షణమే ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని అడ్వకేట్ జనరల్ ధర్మాసనాన్ని కోరడం జరిగింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ.. ‘తీర్పు త్వరగా రాకపోతే.. సినిమా టిక్కెట్ రేట్లను ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుని అమ్ముకుంటారని.. ప్రజలు మోసపోతారని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లి వివరంగా వివరించారు. మొత్తమ్మీద జగన్ పట్టుదలకు పోయినట్టు ఉన్నాడు. ఎలాగూ బాలయ్య అఖండ సినిమాకి వచ్చే కలెక్షన్స్ లో భారీ దెబ్బ వేశాడు.
ఇక మిగిలిన సినిమాల విషయంలో కూడా అలాగే చేస్తే.. జనానికి తక్కువ రేట్ కు సినిమా టికెట్ వస్తుంది, అది తన వల్లే అని ప్రచారం కూడా చేసుకోవచ్చు. అన్నట్టు రానున్న శుక్రవారం పుష్ప సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రభుత్వ సహకారంతో ఏజీ పట్టుబట్టాడు. కాబట్టి.. గురువారం మొదటి కేసుగా టికెట్ రేట్ల కేసు పై విచారణ జరుపుతామని ధర్మాసనం కూడా హామీ ఇచ్చింది.
Also Read: Jagan: జనంలోకి జగన్.. విశాఖ పర్యటనపై అనేక ఊహాగానాలు..!
కాగా, హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై జగన్ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి.. ఏం చేసైనా సరే.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పును కొట్టేసి తమకు కావాల్సిన విధంగా తీర్పు ఇప్పించుకోవాలని జగన్ ప్రభుత్వం ప్లాన్. మరి ఆ ప్లాన్ ప్రకారం హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇస్తే.. ఇక పుష్పతో పాటు మిగిలిన పెద్ద సినిమాలకు కూడా పెద్ద చిల్లు పడినట్టే.
Also Read: Chandrababu: ఆ అస్త్రాన్ని వాడేసేందుకు చంద్రబాబు రెడీ.. జగన్‌కు చిక్కులు..!