రిపబ్లిక్ సినిమా(Republic Movie)కు వైసీపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. సినిమాకు రాని పబ్లిసిటీని పక్కాగా వచ్చేలా చేస్తోంది. గతంలో కూడా పలు సినిమాలకు ఇలాంటి ప్రచారాలే రావడంతో అవి మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిపబ్లిక్ సినిమా(Republic Movie)లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ సినిమా విడుదలైన వారం తరువాత ఆందోళన ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది.

సినిమాలో కథ మొత్తం కొల్లేరు అంశం ఇతివృత్తంగా సాగుతుంది. కానీ ఎక్కడా కొల్లేరు అనే మాట వినిపించదు. దాన్ని తెల్లేరు గా మార్చారు. ఇలాంటి వివాదాలొస్తాయని ముందే గ్రహించాడో ఏమో దర్శకుడు పేరు మార్చి కథ నడిపించారు. సినిమా విడుదలైన మొదట్లో ఎవరు స్పందించకపోయినా ఇప్పుడు ఏదో మునిగిపోయినట్టు ఆందోళన పెంచుతున్నారు. కానీ ఇది సినిమాకే ప్రచారం నిర్వహించేలా ఉపయోగపడుతోంది.
సినిమాలపై వచ్చే పబ్లిసిటీకి ఇదో రకమైన ప్రచారంగా చెబుతున్నారు. సినిమా విడుదలై ఇన్ని రోజులు అయిన తరువాత వైసీపీ నేతలు ముందుకు రావడం సంచలనంగా మారుతోంది. సినిమాలో తెల్లేరు అని చెప్పినందున కొల్లేరు ప్రస్తావన లేదని తెలిసినా వైసీపీ నేతలకు ఆలోచన లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.
దీంతో రిపబ్లిక్ సినిమా(Republic Movie) ప్రచారం ఊపందుకుంటోంది. సినిమా చూస్తే రాని ప్రచారం నేతల ఆందోళనతో వస్తోంది. ఇది సినిమాకు ప్లస్ అవుతోంది. పరిశ్రమలో రిపబ్లిక్ సినిమా క్రేజ్ మరింత పెరుగుతోంది. నేతల తీరుతో సినిమా ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఉచిత ప్రచారంతో సినిమా హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.