Youtuber Anvesh Instagram: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి, తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రముఖ యూట్యూబర్ అన్వేష్(Youtuber Anvesh), నిన్న తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని కోల్పోయిన సంగతి తెలిసిందే. శోకాలు మీడియా లో నెటిజెన్స్ అత్యధిక శాతం అతనికి రిపోర్ట్స్ కొట్టడం తో పాటు, అతని పై పోలీస్ కంప్లైంట్ కూడా ఉండడంతో పోలీసులే అకౌంట్ ని బ్యాన్ చేయించి ఉంటారని అంతా అనుకున్నారు. అకౌంట్ పోయిన తర్వాత అన్వేష్ స్పెషల్ గా ఒక వీడియో ని చేస్తూ ‘పైసా లాభం ఇవ్వని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎంత, పోతే ఎంత. నేను ఆ అకౌంట్ ద్వారా ప్రొమోషన్స్ చేసి డబ్బులు సంపాదించలేదు, ఎవ్వరినీ మోసం కూడా చెయ్యలేదు. నెలకు 8 లక్షలు ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అవి పోయినా నాకేమి ఇబ్బంది లేదు. నా తెలివైన బుర్ర ఉన్నంత వరకు నన్ను ఆపలేరు’ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఆయన అకౌంట్ పోయిన గంటల వ్యవధి లోనే తిరిగి వచ్చేసింది. ఇదే ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్న విషయం. చాలా మంది అనుకున్నది ఏమిటంటే, అన్వేష్ పై పోలీస్ కంప్లైంట్ ఉంది, పోలీసులు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హెడ్ ఆఫీస్ కి లెటర్ పెట్టారు కదా, వాళ్ళ లెటర్ చూసిన తర్వాత అన్వేష్ అకౌంట్ ని బ్లాక్ చేసి ఉంటారని అంతా అనుకున్నారు. ఇలా పోలీసులు లెటర్ పెట్టారు అనే విషయాన్నీ ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. ఆమె చెప్పింది నిజమేనేమో అని అందరూ నమ్మారు. కానీ ఇప్పుడు అన్వేష్ అకౌంట్ తిరిగి రావడం చూస్తుంటే, ఆమె చెప్పినవన్నీ అబద్దాలేనా?, పోలీసులు ఎలాంటి లెటర్ పెట్టలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుమానిస్తున్నారు. ఒకవేళ పోలీసులు లెటర్ పెట్టుంటే, బ్లాక్ అయిన అన్వేష్ అకౌంట్ తిరిగి వచ్చే సమస్యే లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
అకౌంట్ పోయినప్పుడే చాలా బలుపు మాటలతో నెటిజెన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన అన్వేష్, ఇప్పుడు అకౌంట్ తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి వీడియో చేస్తాడు అనేది చూడాలి. ఇక అన్వేష్ అకౌంట్ తిరిగి రావడానికి కారణం, అతని టెక్నీకల్ టీం అని తెలుస్తోంది. సరైన ఆధారాలతో వాళ్ళతో ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆఫీస్ కి అప్పీల్ చేసుకోవడం, అవన్నీ పరిశీలించిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆఫీస్ ఆయన అకౌంట్ ని తిరిగి రీ యాక్టీవ్ చేయడం వంటివి జరిగాయి. ఇక రాబోయే రోజుల్లో ఇతను ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో చూడాలి. అయితే ఎంత పెద్ద అకౌంట్ అయినా ఒకసారి బ్లాక్ అయితే, తిరిగి రావడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది. కానీ అన్వేష్ కి గంటల వ్యవధిలో తిరిగి రావడం చూస్తుంటే ఇతని బ్యాక్ గ్రౌండ్ వేరే లెవెల్ లో ఉందని అర్థం అవుతోంది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.