అనుష్క ‘నిశ్శబ్దం’ పైనే మిగతా సినిమాల భవిష్యత్తు !

అనుష్క సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’ మొత్తానికి అక్టోబర్ 2న దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమా పై, అనుష్క స్టార్ డమ్ పై చాల సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉందట. ఇప్పటివరకూ భారీ అంచనాల మధ్య స్ట్రీమింగ్ యాప్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఏవి ఆకట్టుకోలేదు. ముందుగా కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ లాంటి మల్టీ లాంగ్వేజ్ సినిమా విడుదల అయి, ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది. ఆ తరువాత […]

Written By: admin, Updated On : September 30, 2020 6:45 pm
Follow us on


అనుష్క సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’ మొత్తానికి అక్టోబర్ 2న దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమా పై, అనుష్క స్టార్ డమ్ పై చాల సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉందట. ఇప్పటివరకూ భారీ అంచనాల మధ్య స్ట్రీమింగ్ యాప్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఏవి ఆకట్టుకోలేదు. ముందుగా కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ లాంటి మల్టీ లాంగ్వేజ్ సినిమా విడుదల అయి, ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది. ఆ తరువాత ఎన్నో అంచనాలతో రిలీజైన నాని ‘వి‘ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేపోయింది. దాంతో స్ట్రీమింగ్ యాప్స్ సినిమాలకు భారీ మొతాన్ని ఆఫర్ చేయడం ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసేశాయి. ఈ క్రమంలోనే అనుష్క నిశ్శబ్ధం వస్తోంది. అందరూ ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

Also Read: బిగ్ బాస్: పాపం అరియానా.. ‘మాస్టార్’ చేతిలో మోసపోయింది..!

ఈ సినిమా గనక మంచి సక్సస్ అయితే, ఆ తర్వాత మరికొన్ని సినిమాలు వరసగా ఓటీటీలో రిలీజ్ అవుతాయి. అప్పుడు ఆ సినిమాలకు స్ట్రీమింగ్ యాప్స్ కూడా బాగానే ముట్టచేబుతాయి. ఇప్పటికే రామ్ ‘రెడ్’, సాయి ధరం తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ‘ఉప్పెన’, ప్రదీప్ మాచి రాజు ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’.. లాంటి సినిమాలు మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. ఓటీటీ సంస్థలు నుండి వాటికి భారీ ఆఫర్లు రావాలి అంటే… ఇప్పుడు అనుష్క సినిమా రిజల్ట్ కూడా చాలా కీలకం. మరి చూడాలి.. నిశ్శబ్ధం రిజల్ట్ ఎలా ఉండబోతుందో. ఇక అమెజాన్ ప్రైమ్ సంస్థ నిశ్శబ్ధం సినిమాని సుమారు 45 కోట్లు రూపాయిల భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట. అనుష్క కెరీర్ లోనే ఆమె సినిమాకి ఇంత భారీ మొత్తంలో డబ్బులు వచ్చిన సినిమా ఇదేనట

Also Read: రెంటికి చెడ్డ రేవడిలా టాలీవుడ్ దర్శకులు..!

ఇక ఈ సినిమా ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్.. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరనే కోణంలో ఈ సినిమా ప్లే సాగుతుందట. యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలో మంచి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు అనుష్క పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని.. ఆ నెగెటివ్ యాంగిల్ నుండి పాజిటివ్ యాంగిల్ లోకి ఆమె క్యారెక్టర్ ఎలా మారిందనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంటుందని తెలుస్తోంది. అలాగే అనుష్క, మాధవన్ ల మధ్య నడిచే సస్పెన్స్ ట్రాక్ కూడా చాలా బాగా వచ్చిందట. మరి అమెజాన్ ప్రైమ్ వారు పెట్టిన భారీ మొత్తానికి ఈ సినిమా పూర్తి న్యాయం చేస్తోందని మేకర్స్ కూడా నమ్మకంగా చెబుతున్నారు, మరి చూడాలి అనుష్క ఏ రేంజ్ హిట్ కొడుతుందో.