Anushka Shetty Remuneration: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) వందవ చిత్రం రీసెంట్ గానే మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి నాగార్జున లుక్ కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రముఖ తమిళ డైరెక్టర్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ కమ్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా గోవా లోనే అత్యధిక శాతం షూటింగ్ ని జరుపుకోనుంది అట. నాగార్జున కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో, పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, కచ్చితంగా నాగార్జున కి హీరో గా మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ హీరోయిన్, నాగార్జున కి అత్యంత సన్నిహితురాలైన టబు ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని సోషల్ మీడియా లో ఒక వార్త గత కొద్దిరోజులుగా ప్రచారం లో ఉంది. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియా ని షేక్ చేస్తోంది.
అదేమిటంటే లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి(Anushka shetty) కూడా ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా కనిపించబోతుంది అట. ఆమెని ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం చేసింది నాగార్జున అనే విషయం అందరికీ తెలిసిందే. సూపర్ చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా అనుష్క కి అవకాశాలు వరుసగా క్యూలు కట్టాయి. సూపర్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో డాన్, రగడ, డమరుకం మరియు ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాలు వచ్చాయి. ఇవి కాకుండా ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయన, కింగ్, కేడి వంటి చిత్రాల్లో అనుష్క అతిథి పాత్రల్లో కనిపించింది. ఈమధ్య కాలం లో వీళ్లిద్దరి క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యింది. అందుకే ఈ సినిమా తో ఇప్పుడు మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ భారీ కం బ్యాక్ ఇవ్వనుంది.
ఈ చిత్రం లో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఒక క్యారక్టర్ కి టబు జోడీగా ఉంటుందట, మరో క్యారక్టర్ కి అనుష్క శెట్టి ఉంటుందట. అంతే కాకుండా నాగార్జున కుమారులు అక్కినేని అఖిల్, అక్కినేని నాగచైతన్య ఇందులో కీలక పాత్రలు పోషించే అవకాశాలు కూడా ఉన్నాయట. రాబోయే రోజుల్లో ఈ సినిమా స్పాన్ ఏ రేంజ్ లో ఉండబోతుందోయ్ చూపిస్తారట. నాగార్జున కెరీర్ లో చివరి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’. ఈ చిత్రం తర్వాత మళ్లీ ఆయన బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే హిట్స్ ని అందుకోలేదు. ఆయన తోటి హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి వారు వరుస బ్లాక్ బస్టర్స్ తో ముందుకు దూసుకుపోతుంటే, నాగార్జున మాత్రం కూలీ వంటి చిత్రాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసుకునే పరిస్థితి కి వచ్చాడని, కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ సోలో హీరో గా నాగార్జున అందుకోవాలని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళ ఎదురు చూపులకు తగ్గ సినిమాని నాగార్జున అందిస్తాడో లేదో చూడాలి.