
Anushka Shetty: అనుష్క శెట్టి సినిమాలు బాగా తగ్గించేశారు. డిమాండ్ ఉన్నప్పటికీ ఎడాపెడా సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం ఆమె ఒకే ఒక చిత్రం చేస్తున్నారు. నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె హీరోయిన్. ఇదో భిన్నమైన లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే క్యాచీ టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇదిలా ఉంటే… అనుష్క లేటెస్ట్ లుక్ చూసిన జనాలు షాక్ అయ్యారు. అనుష్క ఏంటి ఇలా అయిపోయారు? ఆమెకు సినిమాలు చేసే ఆలోచన ఉందా లేదా? అన్న సందేహాలు వెలిబుచ్చుతున్నారు. కారణం అనుష్క బాగా బరువు పెరిగారు.
అనుష్క షేప్ అవుట్ అయ్యారని క్లియర్ గా తెలుస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. శివరాత్రి పండగ వేళ కేరళ ఆదియోగి విగ్రహం వద్ద సద్గురు నిర్వహించే జాగరణ కార్యక్రమానికి అనుష్క తల్లిదండ్రులతో పాటు హాజరైంది. ఈ క్రమంలో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాధారణంగా అనుష్క మీడియా ముందుకురారు. ఫోటో షూట్స్ చేయడం అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటి అలవాటు కూడా లేదు. దీంతో అనుష్క ఎలా ఉన్నారనేది బయటకు వస్తే తప్పా తెలియదు.
పెళ్లికాని అనుష్క శరీరం మీద శ్రద్ధ వదిలేయడం ఊహించని పరిణామం. ఇలా ఉన్న అనుష్కను ఎవరు సినిమాల్లోకి తీసుకుంటారనిపిస్తుంది. అనుష్క చేసిన ఒక తప్పు ఆమెను వెంటాడుతుంది. బాహుబలి మూవీ వరకు అనుష్క ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేశారు. బాహుబలి 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యి… సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కొంత సమయం పట్టింది. ఈ గ్యాప్ లో అనుష్క ఒక ప్రయోగాత్మక చిత్రం చేశారు. సైజ్ జీరో టైటిల్ తో 2015లో విడుదలైన ఆ చిత్ర పాత్ర కోసం కావాలని బరువు పెరిగారు.

అది కూడా విపరీతంగా లావయ్యారు. ఇంత పెద్ద సాహసం చేసి సినిమా చేస్తే జీరో సైజ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరోవైపు రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆమె బరువు తగ్గి పూర్వ స్థితికి రాలేకపోయారు. బాహుబలి 2 షూట్ లో లావెక్కిన శరీరంతోనే ఆమె పాల్గొన్నారు. చేసేది లేక సీజీలో అనుష్కను కొంతలో కొంత సన్నగా చూపించే ప్రయత్నం చేశారు. కస్టపడి కొంత మేర బరువు తగ్గారు కానీ గతంలో మాదిరి ఫిట్ బాడీ సాధించలేకపోయారు. కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన అనుష్క సైజ్ జీరో మూవీ నాటి షేప్ లోకి వచ్చేశారు.
