
Actor Naresh: నరేష్ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం, మూడో భార్య రమ్య రఘుపతితో గొడవలతో ఆయన మీడియా దృష్టిలో పడుతున్నారు. తాజాగా ఆయన ఇంటిపై దుండగులు దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గచ్చిబౌలి లో గల తన నివాసం మీద రాళ్లు రువ్వారని చెబుతున్నారు. కారు, కారవాన్, ఇంటి కిటికీల అద్దాలు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఏరియాలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అసలు నరేష్ ఇంటిపై ఎవరు దాడి చేశారనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.
నరేష్ ఇటీవల మూడో భార్య రమ్య రఘుపతిపై దారుణ ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం నన్ను చంపాలని చూస్తుంది. బెంగూరుకు చెందిన ఓ రౌడీ షీటర్ తనపై రెక్కీ నిర్వహించాడని నరేష్ విమర్శలు గుప్పించారు. ఈ దాడి కూడా రమ్య రఘుపతినే చేయించారని ఆయన అనుమానం. అయితే నరేష్ ఇంటిపై రాళ్ల దాడి చేయించడం వలన రమ్య రఘుపతికి ఒరిగేది ఏముంది. అయినా నరేష్ ని హత్య చేయాలనుకుంటే ఇళ్లపై మీద దాడులు చేయరు కదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయ నిర్మల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన రమ్య రఘుపతిని నరేష్ 2010లో వివాహం చేసుకున్నట్లు సమాచారం. వీరికి ఒక అబ్బాయి సంతానం. మనస్పర్థలతో నరేష్-రమ్య రఘుపతి విడిపోయి చాలా కాలం అవుతుంది. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. నరేష్ సెపరేషన్ కోరుకుంటున్నారు. రమ్య అందుకు అంగీకరించడం లేదు. రమ్యతో విడిపోయిన నరేష్ నటి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. దాదాపు నాలుగేళ్లుగా పవిత్ర లోకేష్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు నరేష్ స్వయంగా వెల్లడించారు .

నా ఫోటో ట్యాప్ చేసి ఒక బ్లాక్ మెయిలింగ్ మెటీరియల్ సిద్ధం చేసిందని నరేష్ ఆరోపిస్తున్నారు. 2022 డిసెంబర్ 31న నరేష్ పెళ్లి ప్రకటన చేశారు. పవిత్ర లోకేష్ ని త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దాంతో రమ్య రఘుపతి రీ ఎంట్రీ ఇచ్చారు. నాకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో ఆయన వివాహం చెల్లదంటున్నారు. నా బిడ్డ భవిష్యత్తు కోసం నరేష్ కి విడాకులు ఇచ్చేదే లేదని ఆమె ఖరాకండీగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్నాయి.
