Anushka Ghaati: ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పట్టడమే కాకుండా మంచి సినిమాలను చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక మొదట మనవాళ్ళు చేసే సినిమాలు ఎలాంటి రేంజ్ లో సక్సెస్ లను సాధిస్తాయి అనేది తెలియాల్సి ఉంది…
Also Read: అందువల్లే టెస్ట్ కెప్టెన్సీ తీసుకోలేదు.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన బుమ్రా
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇండస్ట్రీ లో వాళ్లకి చాలా ఎక్కువ రోజులు పాటు కెరియర్ ఉండటమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి పోటీని ఇస్తూ వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదుగుతూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక స్టార్ హీరోలకు పోటీగా సినిమాలను చేసి భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగింది. ఇక ప్రస్తుతం ఆమె క్రిష్ డైరెక్షన్ లో ఘాటి (Ghati) అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాతో మరోసారి స్టార్ హీరోయిన్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరిగే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. జులై 10 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ రేంజ్ లో నిర్వహిస్తున్నట్లు గా తెలుస్తోంది.
మరి ఇప్పటివరకు ఈ సినిమాతో సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న అనుష్క (Anushka) ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరి తనను తాను స్టార్ హీరోయిన్ గా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం ఓసారి తన సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. బాహుబలి (Bahubali) సినిమా తర్వాత ఆమె ఆశించిన మేరకు విజయాలు సాధించలేకపోయింది.
ఇక అప్పటినుంచి ఆమె కంటిన్యూస్ గా సినిమాలను చేయకుండా ఆడపదడప సినిమాలను చేస్తూ రావడం ఆమె హెవీగా వెయిట్ పెరగడం కూడా దానికి ఒక కారణంగా మారిపోయింది. మరి మొత్తానికైతే ఘాటి (Ghati) సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక అరుంధతి (Arundhathi) సినిమాతో ఎలాగైతే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందో ఇప్పుడు ఘాటీ సినిమాతో కూడా అలాంటి రికార్డులను బ్రేక్ చేయడానికి చూస్తుంది. ఇక తను అనుకున్నట్టుగానే స్టార్ హీరోలందరికి పోటీని భారీ విజయాన్ని సాధిస్తూ మరోసారి లేడీ ఓరియంటెడ్ సినిమాల ట్రెండ్ కి తెర లేపుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి సక్సెస్ ను సాధిస్తోంది అనేది…