Anupama Parameswaran: యూత్ ఆడియన్స్ లో ఒక స్టార్ హీరో కి ఉన్నంత క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). ఈమె పేరు చెప్తే పిచ్చెక్కిపోయే అభిమానులు లక్షల్లో ఉన్నారు. రీసెంట్ గానే ఈ కేరళ కుట్టి ‘టిల్లు స్క్వేర్’, ‘డ్రాగన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. నిన్న మొన్నటి వరకు కేవలం సంప్రదాయబద్ధమైన పాత్రలు పోషిస్తూ వచ్చిన అనుపమ పరమేశ్వరన్, టిల్లు స్క్వేర్ చిత్రంలో చూపించిన విలనిజం చూసి ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. ముఖ్యంగా హీరో తో ఆమె చేసిన రొమాన్స్ ఆడియన్స్ బుర్రలను వేడెక్కేలా చేసింది. ‘డ్రాగన్’ చిత్రం లో కూడా నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేసింది. అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోలతో ఇప్పటి వరకు కలిసి సినిమాలు చేయలేదు కానీ, యంగ్ హీరోలందరితో సినిమాలు చేసేసింది.
Also Read: రామ్ తో నిశ్చితార్థం పై స్పందించిన భాగ్యశ్రీ భోర్సే..లేటెస్ట్ పోస్ట్ వైరల్!
అయితే మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అని ఈమెను అడగ్గా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అని ఎన్నో ఇంటర్వ్యూస్ లో తడుముకోకుండా సమాధానం కూడా చెప్పింది. అలాంటి ఈమె పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేసింది అనే విషయం ఎవరికైనా తెలుసా?. రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్ అప్పట్లో మూడేళ్లు సినిమాలకు దూరం అయ్యాడు. మళ్ళీ ఆయన ‘వకీల్ సాబ్'(Vakeel Saab Movie) చిత్రం తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న రోజుల్లో ఈ చిత్రం విడుదలైంది. లాక్ డౌన్ కారణంగా కేవలం వారం రోజులకే అనేక థియేటర్స్ ని మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదంతా మనకు తెలిసిందే, అయితే ఈ సినిమాలో ఉండే ముగ్గురు అమ్మాయిలలో అనన్య నాగేళ్ల క్యారక్టర్ చేసే అవకాశం ముందుగా అనుపమ పరమేశ్వరన్ కి వచ్చిందట.
కానీ మెయిన్ రోల్ కాదు అనే కారణం చేతనో, లేకపోతే బిజీ గా ఉంటూ డేట్స్ సర్దుబాటు చేయలేని కారణం చేతనో ఈ సినిమాని రిజెక్ట్ చేసింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఒకవేళ ఈ సినిమా చేసి ఉంటే అనుపమ పరమేశ్వరన్ కి నటన పరంగా మంచి మార్కులు పడేవి. ఎందుకంటే ఈ సినిమాలో నటించిన ముగ్గురు అమ్మాయిలకు మంచి పేరొచ్చింది. ఇదంతా పక్కన పెడితే అనుపమ పరమేశ్వరన్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని ఈమె హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్ లో ఉదయం 8 గంటల ఆటకు బుర్ఖా వెస్కొని మరీ వెళ్లి చూసి వచ్చిందట. అంత పెద్ద వీరాభిమాని ఈమె. పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్ళు ఈమెని కూడా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. మరి వాళ్ళ కోసం భవిష్యత్తులో వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా చేస్తారో లేదో చూడాలి.