https://oktelugu.com/

Anupama Parameswaran: కొందరికి పెళ్లిళ్లు.. ఇంకొందరికి కడుపులు .. నా బతుకేమో ఇలా! : అనుపమ పరమేశ్వరన్

తాజాగా అనుపమ తన ఏజ్‌లో ఉన్న వారంతా ఏం చేస్తున్నారు.. తానేం చేస్తుంది అన్నట్టుగా ఓ పోస్ట్‌ను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. తన ఏజ్‌లో ఉన్న వాళ్లలో కొందరు పెళ్లి చేసుకుంటున్నారట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 18, 2023 / 02:33 PM IST

    Anupama Parameswaran

    Follow us on

    Anupama Parameswaran: నాగచైతన్య ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.‌ ఈ మలయాళీ బ్యూటీ తెలుగులో రాణిస్తుంది అనుకున్నారు అందరూ. కానీ కారణమేంటో తెలియదు కానీ ఆశించినంత సినిమా ఛాన్సులు మాత్రం ఈ హీరోయిన్ కి రాలేదు. ఇక ఈ మధ్యనే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అనుపమ.. రౌడీ బాయ్స్, 18 పేజెస్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాల్లో కూడా కనిపించింది.

    సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తెగ యక్టివ్ గా ఉంటూ ఉంటుంది అనుపమ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనుపమ చేసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

    తాజాగా అనుపమ తన ఏజ్‌లో ఉన్న వారంతా ఏం చేస్తున్నారు.. తానేం చేస్తుంది అన్నట్టుగా ఓ పోస్ట్‌ను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. తన ఏజ్‌లో ఉన్న వాళ్లలో కొందరు పెళ్లి చేసుకుంటున్నారట.. ఇంకొందరికి కడుపులు అవుతున్నాయట.. కానీ తాను మాత్రం ఇంకా బయటకు వెళ్లాలంటే కూడా పర్మిషన్ తీసుకుంటోందట. అనుపమ ఈ కొటేషన్‌ను షేర్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. ఇక అనుపమ పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

    ఇక కొంతమంది అయితే ఈ పోస్ట్ ని షేర్ చేసి మరి నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అని కామెంట్లు పెడుతున్నాడరు.‌ మరోపక్క ఈ మధ్య అనుపమ మీద నెట్టింట్లో ఎక్కువగా ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

    మరోపక్క ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో బిజీగా ఉన్న అనుపమ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. ఇందుకు ముఖ్య కారణం ఆమె ఈ మధ్య తన ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్ లో నటించడం. రౌడీ బాయ్స్ కోసం ఆశిష్‌తో లిప్ లాక్ చేసింది అనుపమ. దీంతో దెబ్బకు ఆ వీడియో ట్రెండ్ అయింది. ఇక డీజే టిల్లు స్క్వేర్ ప్రోమో వచ్చినప్పుడు కూడా అందులో లిప్ లాక్ ఉండడంతో ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. మొత్తానికి లిప్ లాక్ వల్ల ఎక్కువగా ట్రెండ్ అవుతోంది అనుపమ.