తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఈ ఉదయం రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ను కలిసి తనకు ప్రభుత్వన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు అవసరమైన మంది ఎమ్మెల్యేల బలం ఉన్నదని, అవకాశం ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.