https://oktelugu.com/

Anupama Parameswaran : టిల్లు స్క్వేర్ లో శృంగార సన్నివేశాల్లో అందుకే నటించా.. హోమ్లీ బ్యూటీ అనుపమ ఓపెన్ కామెంట్స్

ప్రతి సినిమాలో హోమ్లీ రోల్ చేస్తే జనాలకు కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకే గ్లామరస్ రోల్ చేశాను. శృంగార సన్నివేశాల్లో నటించానని అనుపమ పరమేశ్వరన్ చెప్పకనే చెప్పింది. ఇక టిల్లు స్క్వేర్ మూవీ మార్చి 29న విడుదల కానుంది. ఈ చిత్రం పై విపరీతమైన హైప్ ఉన్న నేపథ్యంలో మంచి వసూళ్లు సాధిస్తుందని యూనిట్ నమ్ముతున్నారు. మాలిక్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 / 09:21 AM IST

    Tillu Square Romantic Scenes Anupama Parameswaran

    Follow us on

    Anupama Parameswaran : 2022లో వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్. చిన్న బడ్జెట్ మూవీ భారీ లాభాలు పంచింది. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. టిల్లు పాత్రలో సిద్ధూ అద్భుతం చేశాడు. ఇక రాధికగా నేహా శెట్టి మెస్మరైజ్ చేసింది. సిద్దూ-నేహ శెట్టి కాంబోలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది. డీజే టిల్లు సక్సెస్ నేపథ్యంలో సిద్ధూ సీక్వెల్ ప్రకటించాడు. టిల్లు స్క్వేర్ టైటిల్ తో పార్ట్ 2 విడుదల చేస్తున్నాడు. ఈ క్రేజీ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

    డీజే టిల్లు లో నేహ శెట్టి రాధిక పాత్ర చేయగా టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ లిల్లీ రోల్ చేస్తుంది. టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన జనాలు ఒకింత షాక్ అయ్యారు. హోమ్లీ బ్యూటీ అనుపమ రెచ్చిపోయి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. నిజానికి అనుపమ పరమేశ్వరన్ నుండి ఇది ఊహించని యాంగిల్. గతంలో అనుపమ ఈ తరహా రోల్ చేసింది లేదు. రౌడీ బాయ్స్ చిత్రంలో మాత్రం ఓ లిప్ లాక్ సన్నివేశం చేసింది.

    టిల్లు స్క్వేర్ లో అలాంటి సీన్స్ లెక్కకు మించి ఉన్నాయని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. టిల్లు స్క్వేర్ చిత్రంలో శృంగార సన్నివేశాలు చేయడంపై అనుపమ స్వయంగా వివరణ ఇచ్చారు. ప్రమోషన్స్ లో భాగంగా టిల్లు స్క్వేర్ టీమ్ మీడియా ముందుకు వచ్చారు. ‘ఎప్పుడూ ఓకే తరహా పాత్రలు చేస్తుంటే బోర్ కొట్టేస్తుంది. అందుకే టిల్లు స్క్వేర్ మూవీ చేశాను. లిల్లీ పాత్ర నేను రిజెక్ట్ చేస్తే అంతకంటే మూర్కత్వం ఉండదు. ఇలాంటి పాత్ర మరలా రాదు. దర్శకుడు నా పాత్ర రాసిన మేర న్యాయం చేసే ప్రయత్నం చేశాను. బిర్యానీ ఎంత ఇష్టమైనా రోజూ తినలేం కదా…’ అని అనుపమ అన్నారు.

    ప్రతి సినిమాలో హోమ్లీ రోల్ చేస్తే జనాలకు కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకే గ్లామరస్ రోల్ చేశాను. శృంగార సన్నివేశాల్లో నటించానని అనుపమ పరమేశ్వరన్ చెప్పకనే చెప్పింది. ఇక టిల్లు స్క్వేర్ మూవీ మార్చి 29న విడుదల కానుంది. ఈ చిత్రం పై విపరీతమైన హైప్ ఉన్న నేపథ్యంలో మంచి వసూళ్లు సాధిస్తుందని యూనిట్ నమ్ముతున్నారు. మాలిక్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.