Anupam Kher: బాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అది పేరుకు మన దేశంలోనే అతిపెద్ద చిత్ర పరిశ్రమ అయినప్పటికీ.. అది కొంతమంది చేతుల్లో మాత్రమే ఉంది. ఈ పరిశ్రమకు చీకటి సామ్రాజ్యాన్ని ఏలే వ్యక్తుల అండదండలు ఉండడంతో అక్కడ అంతా కూడా వ్యవస్థీకృతంగా జరిగిపోతూ ఉంటుంది. అందువల్లే బాలీవుడ్ పరిశ్రమ తమకు నచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటుంది.. దానికోసం ఏమైనా చేస్తుంది.. ఎంతకైనా తెగిస్తుంది..
Also Read: ‘బ్రో 2’ వచ్చేస్తోంది..సంచలన ప్రకటన చేసిన డైరెక్టర్ సముద్రఖని..వీడియో వైరల్!
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంతమంది వ్యక్తులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటారు. ప్రతిదీ కూడా తమ చెప్పు చేతల్లో ఉండాలని భావిస్తుంటారు. అందువల్లే రకరకాల ప్రచారాలు చేస్తుంటారు.. కృత్రిమ ఉద్యమాలకు తమ అండదండలు అందిస్తుంటారు. ఇక ఆర్థిక సహాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేరమయ, చీకటి సామ్రాజ్యాలను పరిపాలించే వ్యక్తులు ఆడించినట్టు బాలీవుడ్ పెద్దలు ఆడుతుంటారు. ఓ నివేదిక ప్రకారం చీకటి సామ్రాజ్యాలను పరిపాలించే వ్యక్తులు తమ నల్ల డబ్బును బాలీవుడ్ లోకి డంపు చేస్తుంటారు. తద్వారా తమ కోరుకున్న విధంగా చిత్రపరిశ్రమ ఉండాలని భావిస్తుంటారు.. ఇదంతా సయామీ కవలల సంబంధం.
2014లో తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా బిజెపి నరేంద్ర మోడీని ప్రకటించింది. ఆ సమయంలో నరేంద్ర మోడీ దేశ ప్రధాని కాకూడదని బాలీవుడ్ లో కొంతమంది ప్రముఖులు తెర మీదకి వచ్చారు.. సంతకాల సేకరణ కూడా చేశారు.. అయినప్పటికీ నరేంద్ర మోడీ వెనక్కి తగ్గలేదు. బిజెపి కూడా తమ అభ్యర్థి మార్పు విషయంలో రాజీ పడలేదు. చివరికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు. ఏకధాటిగా మూడవ పర్యాయం కూడా మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఒకరకంగా బిజెపి చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయం. నాడు నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినవారు ఇప్పుడు మోకరిల్లుతున్నారు.. ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు.
నాడు బాలీవుడ్ నరేంద్ర మోడీని కాదనుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఇటీవల వెల్లడించారు. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. “బాలీవుడ్ లో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలీవుడ్ మొత్తాన్ని శాసిస్తున్న కొంతమంది వ్యక్తులు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పావులు కదిపారు. ఆయన అధికారంలోకి వస్తే తమ ఆటలు సాగవనేది వారి ప్రగాఢమైన నమ్మకం. అందువల్లే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎన్ని చేయాలో అన్ని చేశారు.. చివరికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వారికి వాస్తవ పరిస్థితి అర్థం అయింది. మొదట్లో అసహనం అని మాటలు మాట్లాడారు.. ఆ తర్వాత అన్ని మూసుకొని కూర్చున్నారని” అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు.