Pawan Kalyan Fans Controversy Anudeep Apology: ప్రముఖ స్టాండప్ కమెడియన్ అనుదీప్ రీసెంట్ గా నిర్వహించిన షో లో పావనమ్ కళ్యాణ్ రామ్ చరణ్ లపై నోరు జారిన విధానంపై అభిమానులు ఏ రేంజ్ లో విరుచుకుపడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా లో అతన్ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టడమే కాకుండా, వాళ్ళు షోస్ నిర్వహిస్తున్న ప్రైవేట్ హాల్ లోకి ప్రవేశించి కొట్టే ప్రయత్నం కూడా చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కామెడీ పేరుతో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సినిమాల మీద ట్రోల్స్ , లేదా రోస్టింగ్ చేయడంలో తప్పు లేదు కానీ , వ్యక్తిగత వ్యవహారాలపై కూడా రోస్టింగ్ చేయడం అనేది చాలా తప్పు. ఈ విషయం ఆ స్టాండప్ కమెడియన్ కి అర్థం అయ్యేలా చేశారు ఫ్యాన్స్.
అయితే తాను కనిపిస్తే చితకబాదే రేంజ్ కోపం లో ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకున్న అనుదీప్, నిన్న క్షమాపణలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేశాడు. ఈ వీడియో లో ఆయన మాట్లాడుతూ ‘రెండు మూడు రోజుల నుండి ఇన్ స్టాగ్రామ్ , సోషల్ మీడియా లో నాపై వస్తున్న థంబ్ నెయిల్స్ ని మీరంతా చూసే ఉంటారు. నేను అప్లోడ్ చేసిన వీడియో చాలా మందిని బాధించింది. కానీ నేను ఉద్దేశపూర్వకంగా అలాంటి కామెంట్స్ చేయలేదు. ఎవరివైనా ఫీలింగ్స్ హార్ట్ అయ్యుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. దీని తర్వాత నుండి ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాము ‘ అంటూ చెప్పుకొచ్చాడు అనుదీప్. ఆయన క్షమాపణలు కొంతమంది అభిమానులు శాంతించారు కానీ, మరికొంతమంది మాత్రం శాంతించడం లేదు. ఎట్టి పరిస్థితిలోనూ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే వదిలేస్తే ప్రతీ స్టాండప్ కమెడియన్ భవిష్యత్తులో ఇలాగే ఇష్టమొచ్చినట్టు మాట్లాడి , క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటారని అంటున్నారు.
ఇప్పటికే అనుదీప్ పై అనేక చోట్ల పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ ఫైల్ అయ్యింది. ఆయన్ని అరెస్ట్ చెయ్యాలి అనే డిమాండ్ రోజుకి రోజుకు పెరుగుతూ పోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రామ్ చరణ్ మరియు ఇతర హీరోల అభిమానులు కూడా నిలిచారు. ఎందుకంటే వాళ్ళ హీరోల పైన కూడా అనుదీప్ ఎన్నో అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మరి అనుదీప్ పై పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) April 12, 2026