2 లక్షలు కూడా ఎక్కువేనట.. పాపం పవన్‌ హీరోయిన్‌

చిత్ర పరిశ్రమ అంటేనే అనిశ్చితికి మారుపేరు. అదృష్టం ఎవరివైపు ఉంటుందో.. ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఓవర్నైట్‌లో స్టార్డమ్‌ వస్తుంది. ఒక్క ఫ్లాప్‌ తో ఆ స్టార్ వాల్యూ నేలకు పడిపోతుంది. అప్పటిదాకా గోల్డెన్‌ హ్యాండ్‌ అనుకున్నవాళ్లపైనే ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర పడుతుంది. ఇలాంటి వాళ్లకు యువ హీరోయిన్‌ అను ఇమాన్యుయెల్‌ను ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికాలో పుట్టిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ 2011లోనే పరిశ్రమలో అడుగు పెట్టింది. స్వప్న సంచారి అనే మలయాళ సినిమాతో అరంగేట్రం చేసింది. […]

Written By: Neelambaram, Updated On : August 28, 2020 2:37 pm
Follow us on


చిత్ర పరిశ్రమ అంటేనే అనిశ్చితికి మారుపేరు. అదృష్టం ఎవరివైపు ఉంటుందో.. ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఓవర్నైట్‌లో స్టార్డమ్‌ వస్తుంది. ఒక్క ఫ్లాప్‌ తో ఆ స్టార్ వాల్యూ నేలకు పడిపోతుంది. అప్పటిదాకా గోల్డెన్‌ హ్యాండ్‌ అనుకున్నవాళ్లపైనే ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర పడుతుంది. ఇలాంటి వాళ్లకు యువ హీరోయిన్‌ అను ఇమాన్యుయెల్‌ను ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికాలో పుట్టిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ 2011లోనే పరిశ్రమలో అడుగు పెట్టింది. స్వప్న సంచారి అనే మలయాళ సినిమాతో అరంగేట్రం చేసింది. కానీ, రెండో అవకాశం కోసం ఐదేళ్లు ఎదురు చూసింది. తెలుగులో నాని సరసన ‘మజ్ఞు’తో టాలీవుడ్‌కు పరిచయం అయింది. అక్కడితో ఆమె లైఫ్‌ టర్న్‌ అయింది. తెలుగులో వరుస అవకాశాలు సొంతమయ్యాయి. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్‌ సినిమాలు చేసింది. చాలా తక్కువ టైమ్‌లోనే ఏకంగా పవన్ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది. కానీ, రెండేళ్ల కిందట వచ్చిన అజ్ఞాతవాసి, నా పేరు శివ సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న శైలజా రెడ్డి అల్లుడు కూడా బోల్తా కొట్టింది. దెబ్బకు అనుపై ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర పడగా అవకాశాలు కరువయ్యాయి. గతేడాది తమిళ్‌లో అడుగు పెట్టినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్‌ మూవీ చేస్తోంది. ఇందులో ఆమె విలన్ భార్య పాత్రను అను పోషిస్తోందని సమాచారం. ఈ సినిమాలో సోనూ సూద్ ప్రతి నాయకుడు. ఇప్పటికే సైడ్‌ యాక్టర్గా, చిన్న చిన్న పాత్రలకు రెడీ అని చెప్పినప్పటికీ ఆమెకు అవకాశాలు రావడం లేదు.

Also Read: మాకు కరోనా రాలేదు.. దయచేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు !

లాభం లేదని వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టిందట. ఆహా ఓటీటీకి చెందిన టీమ్‌ అను ఇమాన్యుయెల్‌ను సంప్రదించిందని సమాచారం. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించే వెబ్‌ సిరీస్‌ కోసం అను డేట్స్‌ అడిగారు. దీనికి అంగీకరించిన అను ఒక్కో ఎపిసోడ్‌కు రూ. రెండు లక్షలు డిమాండ్‌ చేసిందట. వెబ్‌ సిరీస్‌ మహా అయితే ఐదు నుంచి ఏడు ఎపిసోడ్స్‌ ఉంటుంది. ఈ లెక్కన అనుకు గరిష్టంగా 14 లక్షలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు సినిమాకు 30 నుంచి 50 లక్షల దాకా తీసుకున్న అనుకు ఈ రేటు చాలా తక్కువే. డిమాండ్‌ లేకపోవడంతో రెమ్యునరేషన్‌ను బాగా తగ్గించుకుందామె. అయినా సరే ఆహా టీమ్‌ ఎపిసోడ్‌కు రెండు లక్షలు బాగా ఎక్కువ అంటున్నారట. జబర్దస్త్‌ షోతో పాపులర్ అయిన కొంత కమేడియన్లే ఏదైనా ఈవెంట్‌లో పాల్గొంటే రోజుకు లక్ష తీసుకుంటున్నారు. అలాంటి కనీసం నాలుగైదే రోజులు షూట్‌ చేసే వెబ్‌ సిరీస్‌ ఎపిసోడ్‌కు అనుకు రెండు లక్షలు కూడా ఎక్కువే అనడం దురదృష్టకరం.