Star Hero In Ram boyapati Movie: యంగ్ హీరోలలో యూత్ మరియు మాస్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో ఎనర్జెటిక్ స్టార్ రామ్..దేవదాస్ అనే సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్..ఆ తర్వాత యూత్ ఫుల్ ఫామిలీ ఎంటెర్టైనెర్స్ తీస్తూ మంచి ఇమేజి ని సంపాదించుకున్నాడు..మాస్ లుక్స్ ఉన్న హీరో మాస్ సినిమాలు చేయకుండా ఎంతసేపు లవ్ స్టోరీస్ చేస్తాడు ఏంటి అని అభిమానులు దిగులు పడుతున్న సమయం లో పూరి జగన్నాథ్ తో ఆయన చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా రామ్ కి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసింది..ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చిన మాస్ ఇమేజి ని ఒక్కేసారి పదింతలు చేసుకునే ప్లాన్ లో భాగంగా సెన్సషనల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఒక్క సినిమా ఒప్పుకున్నాడు..ఇటీవలే పూజ కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది.

Also Read: Ala Vaikunthapurramuloo House: అలా వైకుంఠపురంలో కనిపించే ఆ అందమైన ఇల్లు ఎవరిదో తెలుసా..?
ఇది ఇలా ఉండగా ఇన్ని రోజులు ఈ సినిమా కేవలం రామ్ సినిమా మాత్రమే అని మనం అనుకున్నాం..కానీ రామ్ తో పాటు మరో హీరో కి స్కోప్ ఉండే కథ అట ఇది..అందుకే ఆ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది..శివ కార్తికేయన్ కి ప్రస్తుతం తమిళనాడు లో మాములు క్రేజ్ లేదు..రజిని కాంత్, కమల్ హాసన్, అజిత్ మరియు విజయ్ వంటి హీరోల తర్వాత టాప్ స్థానం లో నిలుచున్న హీరో ఇతనే..ఇటీవల కాలం లో ఈయన చేసిన డాక్టర్ మరియు డాన్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి..కేవలం తమిళం లో మాత్రమే కాకుండా..టాలీవుడ్ లో కూడా ఈ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచి..శివ కార్తికేయన్ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది..అలాంటి ఇమేజి ఉన్న హీరో ని తీసుకుంటే తమిళ్ మార్కెట్ కూడా బాగా కలిసొస్తుందని బోయపాటి శ్రీను ప్లాన్..మరి శివ కార్తికేయన్ ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి..ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణితి చోప్రా ని తీసుకున్నట్టు తెలుస్తుంది..అంటే ఈ సినిమాని బోయపాటి శ్రీను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట..అనుకున్న విధంగా ఈ సినిమా భారీ హిట్ అయితే కచ్చితంగా రామ్ టాప్ హీరోల లిస్ట్ లోకి చేరుతాడు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Also Read: Samantha Item Song: సమంత మరో ఐటమ్ కి సిద్ధం.. ఈ సారి పరిధి దాటుతుంది !
[…] Also Read: Star Hero In Ram boyapati Movie: రామ్ సినిమాలో మరో స్టార్ … […]
[…] Also Read: Star Hero In Ram boyapati Movie: రామ్ సినిమాలో మరో స్టార్ … […]
[…] Also Read:Star Hero In Ram boyapati Movie: రామ్ సినిమాలో మరో స్టార్ … […]