https://oktelugu.com/

Pushpa 2: ‘పుష్ప 2’లో మరో స్టార్ హీరో.. బన్నీగా పోటీగా దించిన సుకుమార్

Pushpa 2: ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ హీరోగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అందుకే.. ఇప్పుడు ‘పుష్ప 2’ భారీగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2లో మరో హీరోని కూడా తీసుకొస్తున్నారు. తమిళ హీరో విజయ్‌ సేతుపతి పుష్ప 2లో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. నిజానికి పుష్పలో విలన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : July 4, 2022 / 07:08 PM IST
    Follow us on

    Pushpa 2: ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ హీరోగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అందుకే.. ఇప్పుడు ‘పుష్ప 2’ భారీగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2లో మరో హీరోని కూడా తీసుకొస్తున్నారు. తమిళ హీరో విజయ్‌ సేతుపతి పుష్ప 2లో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు.

    Pushpa movie

    నిజానికి పుష్పలో విలన్ గా విజయ్‌ సేతుపతినే నటించాల్సింది. విజయ్‌నే మొదట భన్వర్‌లాల్‌ షెకావత్‌ పాత్ర కోసం అనుకున్నారు. విజయ్‌ డేట్స్‌ సర్టుబాటు కాలేదు. ఆ తర్వాత మలయాళ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ ను ఈ పాత్రకు తీసుకున్నారు. ఐతే.. పుష్ప 2 స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు. విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా ఎలివేట్ చేయబోతున్నారు.

    సుక్కు కావాలనే ఈ పాన్‌ ఇండియా ట్రెండ్‌ ని ఫాలో అవుతున్నాడు. గతంలో వచ్చిన బాహుబలి సినిమాలోనూ, అలాగే రీసెంట్‌ గా వచ్చిన కేజీయఫ్‌-2లోనూ ఒక ఫార్ములా ఉంటుంది. పార్ట్ 2 లో హీరో కి విలన్‌ కి మధ్య భారీ వార్‌ జరుగుతుంది. ఈ వార్ సినిమా మొత్తంలోనే అద్భుతంగా ఉంటుంది. ఈ వార్ తోనే ‘బాహుబలి, కేజీఎఫ్ 2’ సినిమాలు భారీగా సక్సెస్ అయ్యాయి కూడా.

    అందుకే, సుకుమార్ కూడా ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ ఫార్ములాని బన్నీ – విజయ్ సేతుపతిపై ప్రయోగించబోతున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప2లో ‘అల్లు అర్జున్‌ – విజయ్ సేతుపతి’ మధ్య సుకుమార్ భారీ వార్ సీక్వెన్స్ ను పెడుతున్నాడు. ఈ వార్ సీన్లు సినిమాకే మెయిన్ హైలైట్‌ గా నిలుస్తాయట.

    Pushpa 2 movie

    మొత్తానికి పుష్ప 1 కంటే పుష్ప 2లో యాక్షన్ ను ఫుల్ గా పెట్టాడుతున్నాడు సుక్కు. మరి పార్ట్ 1కు మించి పార్ట్ 2 హిట్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం పుష్ప 2 కొత్త షెడ్యూల్ కి టీమ్ రెడీ అవుతుంది.

     
    Recommended Videos

    Tags