High Tension At Sandhya Theatre: మూవీ లవర్స్ కి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో, అందులోనూ సంధ్య 70MM(Sandhya 70MM Theatre) థియేటర్ లో మొదటి రోజు మొదటి ఆట చూడాలని ప్రతీ హీరో అభిమానికి ఉంటుంది. అభిమానుల కేరింతలు, చప్పట్లు, ఈలలు, కటౌట్స్, బ్యానర్స్, ఇలా స్టార్ హీరో సినిమా విడుదలైనప్పుడల్లా థియేటర్ కళకళలాడిపోతూ ఉంటుంది. అలాంటి థియేటర్ గత ఏడాది డిసెంబర్ నెలలో పుష్ప 2 ప్రీమియర్ షో సమయం లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగా వివాదాల్లో చిక్కుకుంది. ఆరోజు థియేటర్ లో సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ ని, ఆయన్ని లోపలకు అనుమతించినందుకు సంధ్య థియేటర్ ఓనర్ ని అరెస్ట్ చేశారు. థియేటర్ లైసెన్స్ ని రద్దు చేసే వరకు ఈ వ్యవహారం వెళ్ళింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, లైసెన్స్ రద్దు కార్యక్రమం నుండి బయటపడ్డారు.
ఇక ఆ తర్వాత యదావిధిగా ఈ థియేటర్ లో సినిమాలు రన్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఈ థియేటర్ చర్చల్లోకి వచ్చింది. PYL సంఘం కార్యకర్తలు సంధ్య థియేటర్ లోని క్యాంటిన్ లో దొరికే ఐటమ్స్ రేట్స్, టికెట్ రేట్స్ తగ్గించాలని, థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు ఈ విషయం లో తమ అభిప్రాయాలను తెలిపి సంతకాలు చేయాలని డిమాండ్ చేశారు. థియేటర్ ముందు ఒక బోర్డు పెట్టి, ఆడియన్స్ సంతకాలు సేకరిస్తుండగా, థియేటర్ సిబ్బంది గొడవకు దిగారు. ఈ క్రమంలో థియేటర్ వద్ద పెద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది, ఇక్కడ అనవసరంగా గొడవలు చేయొద్దని, కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోమని సిబ్బంది ఆందోళనకారులను అక్కడి నుండి పంపే ప్రయత్నం చేశారు. బాల్కనీ టికెట్ రేట్ ఏకంగా 200 రూపాయిలు ఉందని, డ్రెస్ సర్కిల్ టికెట్ రేట్ 150 రూపాయిలు ఉందని, మరో వైపు ప్లేట్ సమోసా బయట 20 రూపాయిలు ఉంటే, థియేటర్ లోపల 50 రూపాయిలు ఉందని, జనల నుండి ఈ రేంజ్ లో డబ్బులు దండుకోవడం మంచిది కాదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.