Mahesh Babu and Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి పాన్ చేసిన సినిమా పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు కేఎల్ నారాయణ నిర్మాత అని, రాజమౌళి ఎప్పుడో ఆరేళ్ళ క్రితం ఆయన దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడని అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమాకి మరో నిర్మాత రాబోతున్నాడు. ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇద్దరు నిర్మాతలు. కేఎల్ నారాయణతో పాటు నిర్మాత దిల్ రాజు కూడా సహా నిర్మాతగా జాయిన్ అవుతాడట.

పాన్ ఇండియా సినిమా కాబట్టి.. భారీ బడ్జెట్ ఉంటుంది. అందుకే కేఎల్ నారాయణ ఒక్కరే హ్యాండిల్ చేయలేక దిల్ రాజును కూడా పార్టనర్ గా తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ జోనర్ లో రాబోతుంది. అందుకే రాజమౌళి గ్యాప్ వచ్చిన ప్రతిసారి ఈ సినిమా స్క్రిప్ట్ పైనే కూర్చుంటున్నాడు.
వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత వీరి కలయికలో సినిమా స్టార్ట్ అవుతుంది. ఓ దశలో ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా సినిమా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచించారు. అయితే, ఛత్రపతి శివాజీ కథ అందరికీ తెలిసిందే. తెలిసిన కథతో భారీ అంచనాలను అందుకోవడం కష్టం. అందుకే ఆ ఆలోచనను విరమించుకున్నారు.
కాగా విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాశారు. ఆ ఫారెస్ట్ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుంది. అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారు. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి.. ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారు. క్లుప్తంగా చెప్పుకుంటే ఈ సినిమా కథ ఇదే.
Also Read: Avika ghor: చిన్నారి పెళ్లి కూతురు జీవితాన్ని నాశనం చేసింది ఎవరు?
కాకపోతే.. ఫారెస్ట్ లో జరిగే యాక్షన్ ఎడ్వెంచరెస్ సీన్లు అద్భుతంగా ఉంటాయట. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి ని మించినోళ్ళు లేరు. కాబట్టి.. సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు.
Also Read: Puneeth raj kumar Video: జిమ్ లో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు వీడియో.. నిజమెంత?