https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ నుంచి మరో భారీ సర్ ప్రైజ్

రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడ్డాయి. సీతగా ఆలియా భట్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ విడుదల కాగా.. అజయ్ దేవ్ గణ్ కు అదిరిపోయే రీతిలో రాజమౌళి వీడియో విడుదల చేసి పెను సంచలనం సృష్టించారు. రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం అజయ్ దేవగణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం ఈ […]

Written By: , Updated On : May 29, 2021 / 08:03 PM IST
Follow us on

RRR

రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడ్డాయి. సీతగా ఆలియా భట్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ విడుదల కాగా.. అజయ్ దేవ్ గణ్ కు అదిరిపోయే రీతిలో రాజమౌళి వీడియో విడుదల చేసి పెను సంచలనం సృష్టించారు.

రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం అజయ్ దేవగణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం ఈ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

రాజమౌళి సినిమా అంటేనే చాలా ట్విస్టులు ఉంటాయి. ఊహించని విధంగా సినిమా ఔట్ పుట్ వస్తుంది. ఈ క్రమంలోనే జక్కన్న ఇందులో ఒక పాటను అదిరిపోయేలా తీర్చిదిద్దుతున్నాడట.. ఆ పాట కోసం రాజమౌళి పెద్ద ప్లాన్ చేశాడని భోగట్టా..

ఇటీవల విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాలోని ఫైట్స్ చూస్తుంటే కన్నీరు వస్తాయంటూ అంచనాలు భారీగా పెంచేశారు. తాజాగా మరో విషయం తెలిసింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోల మీద ఒక పాట ఉంటుందట.. ఆ పాటను జక్కన్న షూటింగ్ చివర్లో ప్లాన్ చేశాడు. ఆ పాటను చాలా అద్భుతంగా చిత్రీకరించేందుకు జక్కన్న ప్లాన్ చేశాడట.. ఇద్దరు హీరోలతో వచ్చే ఈ పాట గూస్ బాంబ్స్ తెప్పిస్తుందట.. సినిమాలో ఉర్రూతలూగిస్తుందట.. ఇది ట్రెండ్ సెట్ చేస్తుందని అంటున్నారు.