‘దిల్ రాజు’ సక్సెస్ సీక్రెట్ వెనుక కారణం ఒక్కటే.. టాలెంట్ ఉన్న వాళ్ళను వెతికి పట్టుకోవడం. అందుకే, పక్క నిర్మాతల చూపు ఎప్పుడు దిల్ రాజు కాంపౌండ్ వైపే ఉంటుంది. దిల్ రాజు బ్యానర్ లో కంటిన్యూగా పని చేస్తున్నాడు అంటే.. అతనిలో విషయం ఉందని ఇండస్ట్రీ నమ్ముతుంది. అందుకే, దిల్ రాజు కాంపౌండ్ లో పని చేయడానికి సాంకేతిక నిపుణులు తెగ ఉత్సాహ పడుతూ ఉంటారు.
వారి ఉత్సాహానికి తగ్గట్టుగానే దిల్ రాజు కూడా దొరికిన టాలెంట్ ను క్యాష్ చేసుకునే వరకు వదిలిపెట్టడు. ఆ మధ్య ‘షాదీ ముబారక్’ అంటూ చక్రవాకం సీరియల్ హీరో సాగర్ హీరోగా ఒక సినిమా రిలీజ్ చేశాడు. సినిమా బాగుంది అని పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఆ సినిమా దర్శకుడు పద్మశ్రీకి అడ్వాన్స్ ఇచ్చి అఫీస్ లో కూర్చోపెట్టాడు దిల్ రాజు.
కోట్లు ఖర్చుపెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేయడం కంటే.. టాలెంట్ ఉన్న కొత్త వాళ్లతో చిన్న సినిమాలు చేసి హిట్లు కొట్టుకోవడం ఉత్తమం అని ఈ మధ్య బాగా ఫీల్ అవుతున్నాడట దిల్ రాజు. అందుకే, అవకాశం దొరికినపుడుల్లా చిన్న సినిమాల మీద పడుతున్నాడు. అయితే దర్శకుడు పద్మశ్రీ, దిల్ రాజు కోరిక మేరకు ఒక కథ రాశాడు. ఒక హీరోకి కథను చెప్పించారు.
ఆ హీరో కూడా కథ బాగుంది చేద్దాం అన్నాడు. కానీ, ఆరు నెలలు నుండి సినిమా మాత్రం ముందుకు వెళ్లడం లేదు. అప్పుడప్పుడు తానే చేసే చిన్న సినిమాలను బాగా లేట్ చేస్తుంటాడు దిల్ రాజు. పైగా ఆ సినిమాలో తనకు సాలిడ్ లాభాలు వస్తేనే ఆ సినిమాని స్పీడ్ గా సెట్స్ పైకి తీసుకువెళ్తాడు. అయితే, దర్శకుడు పద్మశ్రీకి మరో ఏడాది వరకు అలాగే ఎదురుచూడక తప్పేలా లేదు.
ఎందుకంటే దిల్ రాజు మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాబట్టి.. డైరెక్టర్ ను ఏడాది వెయిట్ చేయమన్నాడట. మరి ఈ ఏడాది ఆ పద్మశ్రీ ఆర్ధిక పరిస్థితి ఏమిటి ? దిల్ రాజు ఆ దర్శకుడిని ఆర్ధికంగా పట్టించుకుంటాడా.. ప్రస్తుతానికి అయితే ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదు, శాలరీ లెక్కన అయితే కొంత ఇస్తున్నారట. మొత్తానికి దిల్ రాజు కాంపౌండ్ లో మరో డైరెక్టర్ నలిగిపోతున్నాడు.