Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ అని ప్రియాంక చోప్రాకి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ కి తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు. ప్రియాంక క్రేజ్ ముందు ఏ బాలీవుడ్ స్టార్ హీరో పనికిరాడు అని మరోసారి రుజువు అయింది. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ లో వరుస ఆఫర్లతో జోరు చూపిస్తోంది. ప్రియాంక చోప్రా ఇటీవలే ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్‌తో అలరించింది.

ప్రస్తుతానికి ఈ గ్లోబల్ బ్యూటీ ‘సిటాడెల్’ అనే అమెజాన్ సిరీస్ తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు తెలిసింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆంథోనీ మాకీతో కలిసి ఎండింగ్ థింగ్స్ లో నటించనుంది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన యాక్షన్ కామెడీ సినిమా ‘ట్రూ లైస్’ తరహాలో ఈ సినిమా ఉండనుందని సమాచారం. మొత్తానికి ప్రియాంకకు మరో క్రేజీ ఆఫర్ అంటూ టుడే మొత్తం ప్రియాంక పేరే వైరల్ అవుతుంది.
Also Read: బాయ్స్ హాస్టల్‌లో అమ్మాయి.. నిత్యం అందులో పెట్టి తీసుకెళ్తున్న అబ్బాయి..
అన్నట్టు ‘ప్రియాంక చోప్రా’ ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలో కూడా అందరి కంటే టాప్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రియాంక తన ఇన్‌స్టాలో 72.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ కలిగి ఉంది. ఇండియన్ స్టార్ల లిస్ట్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగి ఉన్న ఏకైక స్టార్ కూడా ప్రియాంక చోప్రానే కావడం విశేషం. అయిత, నేటి ఆమె విజయం వెనుక ఎన్నో కష్ట నష్టాలు ఉన్నాయి.

గ్లోబల్ బ్యూటీ అంటూ నేడు ప్రియాంక చోప్రాకు విపరీతమైన స్టార్ డమ్ వచ్చి ఉండొచ్చు. కానీ.. ఆమె కెరీర్ కూడా కన్నీళ్లతో అవమానాలతోనే మొదలైంది. 16 ఏళ్ల వయసులోనే ప్రియాంక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడింది. ఈ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పింది. డస్కీ బ్యూటీ అంటూ తన మనసును చాలా సార్లు గాయపరిచారని ఆమె పబ్లిక్ గా చెప్పి బాధ పడింది.
పైగా కెరీర్ స్టార్టింగ్ లో ఆమెను కొంతమంది కోరిక తీర్చమంటూ ఒత్తిడి తెచ్చేవారని.. మొదట్లో ఛాన్స్ ల కోసం అలాంటి బాధలను ఎన్నో పడ్డాను అని ఆమె చెప్పింది. పైగా ప్రతి హీరోయిన్ సినిమా సిస్టమ్ కు తగ్గట్టు పని చేసుకుంటూ ముందుకు పోతూనే ఇక్కడ స్థానం ఉంటుందని కూడా ప్రియాంక స్టేట్ మెంట్ ఇచ్చింది.
Also Read: నిస్సారమైన బడ్జెట్ పై ప్రశంసాలా?