https://oktelugu.com/

Harsha Sai: యూట్యూబర్ ‘హర్ష సాయి’ పై మరో కేసు నమోదు..ఇంతమందిని మోసం చేశాడా..ఎలాంటి శిక్ష వేసినా తప్పు లేదు!

ముంబై లో ఉన్నారనే సమాచారం అందడంతో, అక్కడ అతని కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారం లో హర్ష సాయి మొబైల్ ని చూపించి ఆ అమ్మాయిని బెదిరించిన వీడియో తో పాటు, పలు ఆడియో టేపులు కూడా సోషల్ మీడియా లో తిరుగుతున్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 27, 2024 / 02:34 PM IST

    Harsha Sai(1)

    Follow us on

    Harsha Sai: యూట్యూబ్ ద్వారా అశేష ప్రేక్షకాభిమానం ని పొందిన హర్ష సాయి పై ఇటీవలే మిత్రా శర్మ అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. హర్ష సాయి తో ఈమె కలిసి ‘మెగా’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమాకి ఆమె నిర్మాత కూడా. దీనికి ముందు ఆమె బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ కోసం హర్ష సాయి నన్ను పలు విధాలుగా వేధిస్తున్నాడని, నాకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను షూట్ చేసి బెదిరిస్తున్నాడని, కేసు పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ టార్చర్ చేస్తున్నాడని, మెయిల్స్ ద్వారా తనను మానసికంగా ఎంతో వేధిస్తున్నాడని తన తరుపున న్యాయవాదితో వచ్చి నేడు మరో కంప్లైంట్ ని అతని మీద నమోదు చేసింది. గత కొంత కాలంగా హర్ష సాయి తన కుటుంబం తో కలిసి అజ్ఞాతం లో ఉంటున్నాడు. పోలీసులు అతని కోసం చాలా తీవ్రంగా గాలిస్తున్నారు కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ తెలియలేదు.

    ముంబై లో ఉన్నారనే సమాచారం అందడంతో, అక్కడ అతని కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారం లో హర్ష సాయి మొబైల్ ని చూపించి ఆ అమ్మాయిని బెదిరించిన వీడియో తో పాటు, పలు ఆడియో టేపులు కూడా సోషల్ మీడియా లో తిరుగుతున్నాయి. బాధితురాలు కూడా పోలీసులకు పలు కచ్చితమైన ఆధారాలు కూడా సమర్పించిందట. వైద్య పరీక్షల కోసం ఆమెని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చేర్పించారు. అయితే హర్ష సాయి కేవలం ఈ అమ్మాయిని ఒక్కటే కాదట, ఇండస్ట్రీ లో ఎంతో మంది అమ్మాయిలను ఇలాగే టార్గెట్ చేసి డబ్బులు సంపాదించిన సందర్భాలు ఉన్నాయని బాధితురాలి తరుపున న్యాయవాది చెప్తున్నాడు. అంతకు ముందు యువరత్న అనే ప్రముఖ ఇంస్టాగ్రామ్ సెలబ్రిటీ హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్న విషయం పై పెద్ద ఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. పలు మెయిన్ స్ట్రీమ్ మీడియా చానెల్స్ లో కూడా వీళ్లిద్దరి మధ్య లైవ్ డిబేట్స్ నడిచాయి. అప్పటి నుండే హర్ష సాయి నిజస్వరూపం ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

    తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పేద ప్రజలకు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్టు చూపించే హర్ష సాయి వెనుక ఇలాంటి ముఖం కూడా ఉందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయితే హర్ష సాయి ఎలాంటి తప్పు చేయలేదని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సోషల్ మీడియా లో ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఈయన యూట్యూబ్ ఛానల్ కి దాదాపుగా కోటి మంది సస్క్రైబర్స్ ఉన్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఇతన్ని గుడ్డిగా నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. ప్రస్తుతానికి అయితే హర్ష సాయి తప్పు చేసినట్టు అనేక ఆధారాలు ఉన్నాయి, దీనికి ఆయన ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.