RRR Disaster TRP In Hindi: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..అన్ని ప్రాంతీయ బాషలలో సూపర్ హిట్ గా నిలిచినా ఈ చిత్రం సుమారు 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..థియేట్రికల్ గా ఎంత పెద్ద విజయం సాధించిందో..OTT లో అంతకు మించి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ కి ఏకంగా 70 మిలియన్ వ్యూస్ వచ్చాయి..విదేశీయులు ఈ సినిమాని ఎగబడిమరి చూసారు..సుమారు 17 వారల నుండి నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతూనే ఉంది ఈ సినిమా..OTT లో ఆ రేంజ్ రెస్పాన్స్ రప్పించుకున్న ఈ చిత్రానికి టీవీ టెలికాస్ట్ లో ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి..తెలుగు లో ఇటీవలే ప్రసారమైన ఈ సినిమాకి కేవలం 19 TRP రేటింగ్స్ మాత్రమే వచ్చాయి..అభిమానులు దాదాపుగా 25 తృపి రేటింగ్స్ దాకా ఆశించారు..కానీ కనీసం దగ్గర్లోకి కూడా వెళ్ళకపోవడం విశేషం.

ఇక ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన హిందీ వెర్షన్ టెలికాస్ట్ ‘జీ’ ఛానల్ లో ప్రసారమైంది..అక్కడైతే దారుణమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం..కేవలం 4.6 TRP రేటింగ్స్ ని మాత్రమే ఈ సినిమా సొంతం చేసుకుంది..RRR లాంటి భారీ స్కేల్ ఉన్న సినిమాకి ఇది తక్కువ టీఆర్ఫీ రేటింగ్స్ అనే చెప్పాలి..OTT లో అందరూ ఎగబడి చూసేశారని..అందుకే రేటింగ్స్ బాగా తగ్గి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..అసలే #RRR కి ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కలేదని నందమూరి మరియు మెగా అభిమానులు బాగా హర్ట్ అయ్యారు..దీని పై చాలా ఆశలే పెట్టుకున్నారు..చివరికి ఒక్క క్యాటగిరి లో కూడా నామినేషన్ దక్కకపోవడం కేవలం నందమూరి మరియు మెగా అభిమానులకు మాత్రమే కాదు..టాలీవుడ్ కే పెద్ద షాక్..ఈ షాక్ నుండి తేరుకునేలోపు TRP రేటింగ్స్ షాక్ మరొకటి..ఇక రాజమౌళి కూడా ఈ విషయాలేవీ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు..ఆయన ద్రుష్టి మొత్తం మహేష్ బాబు తో త్వరలో చెయ్యబొయ్యే ప్రాజెక్ట్ మీదనే ఉంది..వచ్చే ఏడాది లో ప్రారంభం కాబోతున్న ఈ సినిమా సుమారు 600 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది..ఈ సినిమా తో రాజమౌళి కేవలం పాన్ ఇండియా లెవెల్ కాదు..పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసాడు..అందుకే ఇందులో హాలీవుడ్ టాప్ యాక్షన్ హీరో క్రిస్ హెంవర్థ్ ని ఒక ముఖ్య పాత్రలో తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..క్రిస్ హెంవర్థ్ ఎవరో కాదు..’థోర్’ సినిమాలో హీరో..అత్యంత ప్రతిష్టాత్మకంగా టాలీవుడ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం లో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.
