Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 మొత్తానికి రసవత్తరంగా మొదలైంది. హౌస్ లోకి ఎవరు వస్తున్నారు ?, ఈ సీజన్ లో విన్నర్ గా నిలిచే ఛాన్స్ ఎవరికీ ఎక్కువగా ఉంది ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైగా ఈ సీజన్ 6 విభిన్నమైన కంటెంట్ తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వస్తోంది. అందుకే.. తెలుగు ప్రేక్షకులు కూడా సీజన్ 6 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, నిన్న ప్రారంభమైన ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవ్వరూ ఊహించని వారు ఎంట్రీ ఇస్తున్నారు.

ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంటే.. అదేమిటి ? వీరు వస్తున్నారు ఏమిటి ? అంటూ ప్రేక్షకుల కూడా సర్ ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. ఇందులో భాగాంగానే ప్రముఖ యాంకర్ ఆరోహి రావు కూడా బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో ఒక్కసారిగా ఎవరు ఈ ఆరోహి రావు ? అంటూ నెటిజన్లు ఆమె పై పడ్డారు. మరి ఆమె గురించి విశేషాలు, విషయాలు ఏమిటో తెలుసుకుందాం.
యాంకర్ ఆరోహి రావు తెలంగాణలోని వరంగల్లో పుట్టి పెరిగింది. ఆమెకు సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచి బలమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే కొన్నాళ్ళు సినిమాల్లో కూడా ట్రై చేసింది. అయితే, అవకాశాలు రాలేదు. దాంతో బతుకు తెరువు కోసం ఆరోహి రావు, టీవీ 9 యాంకర్ గా మారింది. పైగా అక్కడా బాగా పాపులర్ కూడా అయింది. ప్రధానంగా ఇస్మార్ట్ న్యూస్ తో చాలా బాగా ఫేమస్ అయింది.

ఆరోహి రావు చదువు విషయానికి వస్తే.. ఆమె హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్పీజీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసింది. తన డిగ్రీ విద్య పూర్తయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఛాన్స్ లు రాకపోయే సరికి యాంకర్గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. అయితే, ఆరోహి రావు మొదటగా భీమ్స్ మీడియాలో జాబ్ చేసింది. అక్కడ వచ్చిన అనుభవంతోనే ఆమె యాంకర్ గా బాగా ఫేమస్ అవ్వగలిగింది.
నిజానికి, ఆరోహి రావు ఐ5 నెట్వర్క్, పొలిటికల్ బెంచ్, స్టూడియో న్యూస్ వంటి వివిధా వార్తా ఛానెల్స్ లో పనిచేసినా..ఆమెకు గుర్తింపు మాత్రం టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్ తోనే వచ్చింది. ఈ షోతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మరి ఆమె ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.