Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ కి గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. అనుబంధం అనే దానికంటే.. అవినాభావ సంబంధం ఉంది అనడం కరెక్ట్. అందుకే రజనీ సినిమాలో బాలు పాట ఉండాల్సిందే. లేకపోతే రజిని ఫీల్ అవుతారు. ఇదేదో మాట వరసకు చెబుతున్న మాట కాదు. ఓ సినిమా విషయంలో ఇది నిజంగానే జరిగింది. సినిమా ఆల్బమ్ పూర్తి అయింది. రజిని పాటలు మొత్తం విన్నారు. చాలా బాగున్నాయని సంగీత దర్శకుడిని, దర్శకుడ్ని అభినందించారు.

అయితే, సడెన్ గా రజనీ సీరియస్ అవుతూ.. బాలు గారి చేత పాట ఎందుకు పాడించలేదు అని ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. దాంతో షాక్ అయిన సంగీత దర్శకుడు ఆ తర్వాత బాలు గారి చేత పాట పాడించాడు. అది రజినీకి బాలు కి మధ్య ఉన్న సంబంధం. అయితే, రజినీకాంత్ కొత్త సినిమా.. ‘అన్నతే’. ఈ సినిమా నుంచి తొలి సాంగ్ వచ్చేసింది.
అయితే ఈ పాటని పాడింది ఎవరో తెలుసా ? బాలసుబ్రమణ్యం గారే. ఈ పాటను గత ఏడాది రికార్డు చేశారు. కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అవ్వడంతో ఈ పాట తాజాగా విడుదలైంది. పాట బాలు నోట నుండి వచ్చింది కాబట్టి.. అద్భుతంగానే ఉంది. అయితే, ఈ పాట గురించి రజినీకాంత్ ఓ ట్వీట్ చేశారు.
“45 ఏళ్ళు నా గొంతుగా ఉన్నారు బాలు. ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు ఇదే మా ఇద్దరి కాంబినేషన్ లో చివరి పాట అవుతుందని నేను అసలు ఊహించలేదు. ప్రియమైన నీ పాట అజరామరం’ అంటూ రజినీకాంత్ ఎమోషనల్ గా ట్వీట్ చేయడం విశేషం. నిజంగా రజిని గతంలో ఇలా ఎవరి గురించి ట్వీట్ చేయలేదు. బాలు అంటే ఆయనకు అంత ప్రేమ ఉందా ? అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇక ‘అన్నతే’ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార, మీనా, ఖుష్బూ నటిస్తున్నారు. ఈ మూవీకి శివ దర్శకుడు. దీపావళి కానుకగా వచ్చే నెల 4న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. పైగా ఈ సినిమాలో రజిని కూతురిగా కీర్తి సురేష్ నటిస్తోంది.
ఏది ఏమైనా తన తియ్యని స్వరంతో ఎన్నో అపురూప పాటలను అందించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటల రూపంలో ఎప్పటికీ మన మధ్య జీవించే ఉంటారు.