‘కింగ్డమ్’ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ‘కూలీ’ చిత్రం ఆగష్టు 14 న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల గురించి అనిరుద్ లేటెస్ట్ గా మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆయన మ్యూజిక్ అందించే సినిమాలు విడుదలకు ముందు ఫైనల్ ఔట్పుట్ బాగా వచ్చిందంటే ఫైర్ ఎమోజీలు పెడుతాడు. అలా ఆయన ఫైర్ ఎమోజీలు పెట్టిన సినిమాలన్నీ భారీ హిట్స్ గా నిలిచాయి. అదే ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలు విడుదలకు ముందు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే, అవి భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఉదాహరణకు ‘ఇండియన్ 2’, ‘విడాముయార్చి’ చిత్రాలు విడుదలకు ముందు ఆయన ఎలాంటి సౌండ్ చేయలేదు. ఆ చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నాయో మనమంతా చూసాము. ఇలా సినిమా విడుదలకు ముందు అభిమానులకు ఆ చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి ఒక హింట్ ఇచ్చేస్తుంటాడు అనిరుద్. ఇప్పుడు కింగ్డమ్, కూలీ చిత్రాల గురించి ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.
ఆయన మాట్లాడుతూ ‘ఈసారి మీరు నా నుండి ఎమోజీల ట్వీట్స్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కూలీ చిత్రం మొత్తాన్ని నేను చూసాను, చాలా బాగా వచ్చింది. రజిని ఫ్యాన్స్ కి పండగ లాగా ఉంటుంది. కింగ్డమ్ చిత్రాన్ని కూడా ఒక 30 నిమిషాలు చూసాను, ఇది కూడా బాగుంటుంది అనే అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. కింగ్డమ్ గురించి గొప్పగా చెప్పకపోవడం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి ‘హృదయం లోపల’ అనే లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విజయ్ దేవరకొండ హిట్ కొడుతాడు అనే నమ్మకం అందరిలో కలిగింది. ఎందుకంటే ఆయన ఏ జానర్ లో స్ట్రాంగ్ గా ఉంటాడో, ఆ జానర్ తోనే రాబోతున్నాడు. మే 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతమేరకు అలరిస్తుందో చూడాలి.