Anirudh Ravichander Hyderabad Music Event: సౌత్ ఇండియా లో ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్స్ క్యాటగిరీలో నెంబర్ 1 స్థానం లో ఉన్నది ఎవ్వరు అని అడిగితే, మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అనిరుద్ రవిచందర్(Anirudh Ravichander). ఈయన నుండి వచ్చే ప్రతీ ఆల్బమ్ బ్లాక్ బస్టరే. అందుకే దర్శక నిర్మాతలు అనిరుద్ కి ఎంత డబ్బులు డిమాండ్ చేసినా ఇచ్చి, తమ సినిమాలకు తీసుకుంటున్నారు. ఆయన మీద ఉన్న పని ఒత్తిడి షధారణమైనది కాదు. దర్శకులు ఆయన ఇచ్చినప్పుడే ట్యూన్స్ ని తీసుకోవాలి. లేదు మాకు ఇప్పుడే కావాలి అని గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితి. కానీ ఆలస్యం అయినా కూడా అద్భుతమైన ట్యూన్స్ ఇస్తాడు అనిరుద్. ఆయన పాటలు ఒక ఎత్తు అయితే , సినిమాల్లో ఆయన అందించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో ఎత్తు. చాలా సినిమాలను కేవలం తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సూపర్ హిట్స్ ని చేసిన సందర్భాలు ఉన్నాయి.
అందుకే యూత్ ఆడియన్స్ అనిరుద్ మ్యూజిక్ అంటే చెవులు కోసేసుకుంటారు. కేవలం సినిమా ఆల్బమ్స్ కి మాత్రమే కాదు, అనిరుద్ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ కి కూడా అద్భుతమైన క్రేజ్ ఉంది. ఇది వరకు ఆయన చెన్నై, విదేశాల్లో ఎన్నో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ ని నిర్వహించాడు. మొట్టమొదటిసారి ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఫిబ్రవరి 21 వ తేదీ, సాయంత్రం ఆరు గంటల నుండి ఈ మ్యూజిక్ షో ప్రారంభం కానుంది. గచ్చిబౌలి అవుట్ డోర్ స్టేడియంలో సుమారుగా నాలుగు గంటల పాటు ఈ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనుంది. ఇప్పటి వరకు ఆయన తెలుగు, తమిళ భాషల్లో చేసిన సినిమాల పాటలన్నీ ఈ కన్సర్ట్ లో పెర్ఫార్మ్ చేయబోతున్నాడు. ఏజ్ లిమిట్ లేదు, 5 సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరూ ఈ ఈవెంట్ లో పాల్గొనొచ్చు.
బుక్ మై షో యాప్ లో టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఒక్కో టికెట్ ధర 4000 రూపాయిల నుండి 30000 వరకు ఉండొచ్చని అంచనా. నేడే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుంది. మరి ఈ రేంజ్ టికెట్ రేట్స్ ఉన్నప్పటికీ కూడా జనాలు ఎగబడి కొనుగోలు చేసి ఈ ఈవెంట్ కి వస్తారా లేదా అనేది చూడాలి. అప్పుడే ఈ ఈవెంట్ బుక్ మై షో యాప్ లో ట్రెండ్ అవ్వడం కూడా మొదలు పెట్టింది. ఇకపోతే అనిరుద్ సినిమాల విషయానికి వస్తే, ఆయన సంగీతం అందించిన ‘జన నాయగన్’ చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది. మరోపక్క ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’, అల్లు అర్జున్ , లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాకు సంగీతం దర్శకత్వం వహిస్తున్నాడు. అదే విధంగా నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రానికి కూడా సంగీతం అందించాడు. ఈ చిత్రం నుండి మొదటి పాట ‘ఆయా షేర్’ ఈ నెల 24 న విడుదల కాబోతుంది.