Anirudh and Rajinikanth Relationship: సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth) కుటుంబీకులు సినీ ఇండస్ట్రీ లో ఉన్నవారు ఎవరంటే మన అందరికీ ధనుష్(Dhanush K Raja) గుర్తుకువస్తాడు. ధనుష్ కెరీర్ ప్రారంభం లో హీరో గా నిలదొక్కుకుంటున్న సమయంలోనే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తో ప్రేమాయణం నడిపి ఆమెని పెళ్లి చేసుకున్నాడు. కానీ రీసెంట్ గానే వీళ్లిద్దరు కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఆ కారణాలు ఏంటో తెలియదు కానీ, పెళ్లి జరిగిన పాతికేళ్లకు ఇద్దరు ఎదిగిన పిల్లలు ఉన్న సమయంలో వీళ్ళు విడాకులు తీసుకోవడం దురదృష్టకరం. ఇక ధనుష్ కాకుండా రజనీకాంత్ కుటుంబీకులలో సినీ ఇండస్ట్రీ లో ఉన్నది ఎవరంటే, ఆయన ఇద్దరు కూతుర్లు ఐశ్వర్య, సౌందర్య పేర్లను చెప్పొచ్చు. వీళ్లిద్దరు డైరెక్టర్స్ గా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ఒక్కటి కూడా హిట్ కాలేదు అనుకోండి. అయితే వీళ్ళు కాకుండా రజనీకాంత్ కుటుంబం నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇప్పుడొక మ్యూజికల్ సెన్సేషన్.
సౌత్ ఇండియా లో అతని ఏ సినిమాకి అయినా సంగీతం అందించాడంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే అనుకోవాలి. పేలవంతమైన సన్నివేశాలను కూడా తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లే సత్తా అతనికి మాత్రమే సొంతం. అతను రజనీకాంత్ మేనల్లుడు, ఆయన మరెవరో కాదు, అనిరుద్ రవిచందర్(Anirudh Ravichander). అవును ఈయన రజినీకాంత్ సతీమణి లతా గారి సోదరుడి కొడుకు. అనిరుద్ రవిచంద్రన్ తండ్రి కూడా ఇండస్ట్రీ కి చెందిన వాడే. పేరు రవి రాఘవేంద్ర. ఈయన తమిళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా, హీరో గా నటించి మంచి పాపులారిటీ ని సంపాదించాడు. ఆయన కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన అనిరుద్ తొలిసినిమాతోనే సెన్సేషన్ ని సృష్టించాడు. అప్పటి నుండి మొదలైన అనిరుద్ రవిచంద్రన్ జైత్ర యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన రజనీకాంత్ ‘కూలీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు లో కూడా ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక నిన్నగాక మొన్న విడుదలైన మోనికా పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. రజనీకాంత్ సినిమా అంటే అనిరుద్ తన ప్రాణం పెట్టేస్తాడు. అలా ఇప్పటి వరకు ఆయన రజనీకాంత్ కి కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కూలీ లోని పాటలకు కూడా అదే రేంజ్ రెస్పాన్స్. ఇక ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఏ రేంజ్ లో అందించి ఉంటాడో చూడాలి.