Animal Collection: బాక్సాఫీస్ పై యానిమల్ దండయాత్ర… 10 రోజుల్లో ఎన్ని వందల కోట్లు అంటే?

ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ యానిమల్ అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డారు. మరొక సెక్షన్ పూర్తి విరుద్ధమైన అభిప్రాయం వెల్లడించారు. అదొక చెత్త చిత్రం. మితిమీరిన వైలెన్స్, శృంగార సన్నివేశాలతో నింపేశారని ఆరోపణలు చేశారు.

Written By: NARESH, Updated On : December 11, 2023 3:55 pm

Animal Collection

Follow us on

Animal Collection: యానిమల్ మూవీ వసూళ్ల వర్షానికి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడం లేదు. రెండో వీకెండ్ లో కూడా యానిమల్ కుమ్మేసింది. వెయ్యికోట్ల వసూళ్లకు దిశగా అడుగులు వేస్తుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీపై మొదటి నుండి హైప్ ఉంది. యానిమల్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్న నేపథ్యంలో ఆడియన్స్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూశారు. అనూహ్యంగా ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ యానిమల్ అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డారు. మరొక సెక్షన్ పూర్తి విరుద్ధమైన అభిప్రాయం వెల్లడించారు. అదొక చెత్త చిత్రం. మితిమీరిన వైలెన్స్, శృంగార సన్నివేశాలతో నింపేశారని ఆరోపణలు చేశారు. యానిమల్ మూవీ గురించి పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. ఛత్తీస్ఘడ్ కి చెందిన ఓ ఎంపీ యానిమల్ మూవీ చూస్తూ సగంలోనే ఏడుస్తూ నా కూతురు బయటకు వచ్చేసింది.

యానిమల్, పుష్ప వంటి చిత్రాలు సమాజానికి చేటు చేస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నెగిటివ్ పబ్లిసిటీ కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. ఈ స్థాయిలో విమర్శించేంత వైలెన్స్ సినిమాలో ఏముందో తెలుసుకోవాలని కూడా కొందరు ఆడియన్స్ యానిమల్ థియేటర్స్ కి వెళుతున్నారు. ఫస్ట్ వీకెండ్ ఘనంగా ముగించిన యానిమల్ సెకండ్ వీకెండ్ కూడా క్యాష్ చేసుకుంది. శని, ఆదివారాల్లో వసూళ్లు కుమ్మేసింది.

దీంతో 10 రోజులకు యానిమల్ మూవీ రూ. 717.46 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ట్రెండ్ చేస్తుంటే యానిమల్ రూ. 1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. పఠాన్, జవాన్ తర్వాత 2023లో వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో యానిమల్ చేరనుంది. రన్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్రాల్లో రష్మిక మందాన హీరోయిన్. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక రోల్స్ చేశారు.