Anil Ravipudi (1)
Anil Ravipudi: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా అవతరించాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో త్రిబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. నిర్మాత దిల్ రాజుకు కాసుల వర్షం కురిపిస్తుంది సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఇక వెంకటేష్ కి కెరీర్ ని కూడా కీలక మలుపు తిప్పింది. ఇక వెంకీ మామ పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలో సరైన సినిమా పడితే.. ఆర్ ఆర్ ఆర్ రికార్డులు కూడా లేపేస్తాడని తేలింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఏకంగా రూ. 250 కోట్లకు పై వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది.
రామ్ చరణ్, బాలకృష్ణలకు ఝలక్ ఇస్తూ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. వెంకీకి సంక్రాంతికి వస్తున్నాం మరో లాంచ్ వంటిది అనడంలో సందేహం లేదు. కాగా నానికి కూడా అనిల్ రావిపూడి పెద్ద ఫేవర్ చేశాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నానిని హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో చాలా బాగుంది ఒకటి. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. రొమాంటిక్ లవ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన చాలా బాగుంది మూవీ సూపర్ హిట్.
నిత్యా మీనన్, నాని జంటగా నటించారు. నిత్యా మీనన్ కి కూడా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది ఈ చిత్రం. కాగా చాలా బాగుంది మూవీని విడుదలకు ముందు అనిల్ రావిపూడి చూశాడట. అద్భుతంగా ఉంది. కామెడీ అదిరిపోయిందని చెప్పాడట. నిర్మాత మాత్రం ఈ సినిమా విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయని అనిల్ రావిపూడితో డిస్కస్ చేశాడట. అనిల్ రావిపూడి కొన్ని మార్పులు చెప్పాడట. అనిల్ రావిపూడి చెప్పిన మార్పులు విన్న నిర్మాత.. మీరే ఈ సన్నివేశాలు రాయమన్నారట.
చాలా బాగుంది మూవీ క్లైమాక్స్, ఆశిష్ విద్యార్ధికి సంబంధించిన సన్నివేశాలు మార్చి రాశాడట. చాలా బాగుంది మూవీ భారీ విజయం సాధించడంలో అనిల్ రావిపూడి కీలక పాత్ర పోషించాడు. పరోక్షంగా నాని కెరీర్ కి మంచి పునాది వేశాడు. కాబట్టి నానికి అనిల్ రావిపూడి చేసిన సాయం ఎప్పటికీ మరవలేనిది అని చెప్పాలి. అయితే చాలా బాగుంది సినిమాకు అనిల్ రావిపూడికి క్రెడిట్ దక్కలేదని తెలుస్తుంది.