Chiranjeevi Birthday Surprise: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి… ప్రస్తుతం ఆయన చిరంజీవితో ఒక కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలవడంతో చిరంజీవి సినిమా కూడా సూపర్ హిట్ అవుతోంది అనే ఒక కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇప్పటివరకు అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ చాలా హైలెట్ అవుతుంటుంది. అయితే కొంతమంది మాత్రం ఆయన సినిమాల్లో క్రింజ్ కామెడీ ఉంటుందని కామెంట్లను చేస్తుంటారు. మొత్తానికైతే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అతని సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవిని ఒక డిఫరెంట్ గెటప్ లో చూపించి కామెడీ చేయించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వీళ్ళిద్దరు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…అయితే ఈ నెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అనిల్ రావిపూడి అభిమానులకి ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ అది ఏంటి అంటే చిరంజీవి చేస్తున్న సినిమా టైటిల్ ను రివిల్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో అనిల్ రావిపూడి ఉన్నాడట. మరి దానికి అనుగుణంగానే ఆ దిశగా పనులను సైతం పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కినటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న అనిల్ రావిపూడి ఈ సినిమాని పర్ఫెక్ట్ గా డెలివరీ చేయాలని చేస్తున్నాడు.
Also Read: లోకేష్ కనకరాజ్ చేసిన సినిమాల్లో రజినీకాంత్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?
ఇక అనిల్ తన సినిమాలను భారీ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ ప్రేక్షకులకు చేరువయ్య విధంగా సినిమాలను చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు ఆయన వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను సైతం భారీగా ప్రమోషన్స్ చేసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిపే ప్రయత్నం చేశాడు.
ఇక దానికి అనుగుణంగానే చిరంజీవి సినిమాని సైతం స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచే ప్రమోషన్స్ అయితే మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఈ టైటిల్ రివిల్ చేయడం అనేది కూడా ఒక పెద్ద ప్రమోషన్ లో భాగంగానే అతను భావిస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే టైటిల్ రివిల్ చేసి అభిమానులకు ఒక సడన్ సర్ ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ఇది సక్సెస్ ఫుల్ గా అభిమానులకు రీచ్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…