Akhanda 2 Movie Postpone: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కెరీర్ మొదట్లో మాస్ సినిమాలను చేస్తూ బి, సి సెంటర్లలో మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు అప్పటినుంచి ఇప్పటివరకు మాస్ సినిమాలను చేస్తూనే మరికొన్ని వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు. బాలయ్య బాబు చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టినవే కావడం విశేషం… ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్న బాలయ్య ఇప్పుడు బోయపాటి డైరెక్షన్లో చేస్తున్న అఖండ 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు… ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక అలజడి క్రియేట్ చేసింది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన వస్తుందంటూ మేకర్స్ ప్రకటించినప్పటికి ఆ తేదీన వస్తుందా? లేదంటే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి.
కారణమేంటి అంటే అదే రోజున పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్లో చేసిన ఓజీ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే అఖండ 2 సినిమా కంటే ముందే ఓజి సినిమా టీజర్ డేట్ ని లాక్ చేసుకున్నారు. మరి ఒకరు లాక్ చేసుకున్న డేట్ కి మరో హీరో రావడం అనేది సరైన పద్ధతి కాదని చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read: చిరంజీవి బర్త్ డే రోజు అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న అనిల్ రావిపూడి…
నిజానికి రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయితే రెండు సినిమాలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఎవరో ఒకరు వన్ వీక్ గ్యాప్ సినిమాలను రిలీజ్ చేసుకుంటే మంచిదని మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం ఆయా దర్శక నిర్మాతలకు సలహాలను ఇస్తున్నారు… ఇక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.
దీపావళి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి బోయపాటి ఈ విషయం మీద ఎలా స్పందిస్తాడు…మరి అఖండ 2 సినిమాని నిజంగానే పోస్ట్ పోన్ చేస్తున్నారా లేదంటే అదే డేట్ కి రిలీజ్ చేస్తారా? అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…