Anil Ravipudi And Chiranjeevi: 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీపడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఈ ఏజ్ లో కూడా డాన్స్ లు చేస్తూ హుక్ స్టెప్ అంటూ డిఫరెంట్ గా స్టెప్పులను వేస్తున్న ఆయనకు సాటి ఎవరూ రారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… గతంలో ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెడితే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు అతన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం సీనియర్ హీరోలందరిలో మొదటి వరుసలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇకమీదట చేయబోతున్న సినిమాలు సైతం సక్సెస్ ఫుల్ సినిమాలు గానే నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర వర ప్రసాద్’ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. అనిల్ రావిపూడి వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే 8 విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఆయన మన శంకర వరప్రసాద్ సినిమాతో తొమ్మిదో విజయాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండే అవకాశం లేదంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్లు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ట్రైలర్ లో చూపించిన ఏ షాటు కూడా పెద్దగా ప్రేక్షకుడిని మెప్పించలేదు. ఇంతకుముందు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రొటీన్ సినిమా అయినప్పటికి అందులో ఎంటర్టైన్మెంట్ ని జోడించిన విధానం బాగుంది. కాబట్టి ఆ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలిచింది.
కానీ ఈ సినిమాలో ట్రైలర్ ఏ మాత్రం ఎఫెక్టివ్ గా ఉండకపోవడమే కాకుండా ప్రేక్షకులను మెప్పించే విధంగా లేదు. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు చాలా తక్కువని ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు… చూడాలి మరి అనిల్ రావిపూడి వరుస సక్సెసు లకు ఈ సినిమా చెక్ పెడుతుందా..? లేదంటే గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతోందా అనేది…