Anil Ravipudi Responds To Rumors: ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నాడు అని. గత సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని, ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అనిల్ రావిపూడి కోసం నిర్మాతలు క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. తక్కువ బడ్జెట్ తో, తక్కువ రోజుల్లో సినిమాని పూర్తి చేసి, భారీ బ్లాక్ బస్టర్ ని అందించే డైరెక్టర్ దొరికితే ఎవరు మాత్రం సైలెంట్ గా ఉంటారు చెప్పండి. అయితే అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నాడు అనేది అధికారికంగా ప్రకటించకముందే, సోషల్ మీడియా లో ఎన్నో కథనాలు ప్రచారం అవుతున్నాయి.
అనిల్ తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నాడని, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోందని, ఇందులో వెంకటేష్ తో పాటు మరో హీరో కూడా నటిస్తాడని, ఫహాద్ ఫాజిల్ కోసం సంప్రదింపులు జరిపారని, కానీ ఆయన పది కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ అడగడం తో వెనకడుగు వేశారని, ఇలా ఎన్నో రకాల వార్తలు గడిచిన వారం రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఫహాద్ ఫాజిల్ బదులు, తమిళ హీరో కార్తీ ని సంప్రదిస్తున్నారని, ఆయన కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ఇలా తన ప్రమేయం లేకుండా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తలపై అనిల్ రావిపూడి స్పందించాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘నా తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియా లో అనేక కథనాలు వస్తున్నాయి. దయచేసి నేను అధికారికంగా చెప్పే వరకు ఏది నమ్మొద్దు. మీడియా రిపోర్టర్స్ కూడా మీకు తోచిన స్టోరీలు అల్లకండి. ఏదైనా ఉంటే నేనే మీకు స్వయంగా చెప్తాను . ఆడియన్స్ లో ఉన్న క్యూరియాసిటీ ని చంపకండి’ అంటూ ఆయన రిక్వెస్ట్ చేసాడు. క్యూరియాసిటీ ని చంపొద్దు అంటున్నాడు అంటే, ఇప్పటి వరకు సోషల్ మీడియా లో ప్రచారమైన వార్తలన్నీ నిజమేనా?, అవి బయటకు లీక్ అయ్యినందుకే అనిల్ రావిపూడి కి ఫ్రస్ట్రేషన్ వచ్చిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆయన కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను మార్చి 19న, అనగా ఉగాది రోజున తెలియజేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.