Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. స్టార్ హీరోలతో సినిమాలను చేసే అవకాశం కూడా వీళ్ళకే వస్తుంది. అందుకే వాళ్ళు ప్రతి సినిమా విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు వరుస విజయాలను సాధించిన అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పటికే 9 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాలతో మరింత సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు అనిల్ రావిపూడి చేసిన తక్కువ సినిమాలతోనే తెచ్చుకున్నాడు.
వరుస విజయాలను సాధిస్తున్న ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాలతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ప్రస్తుతం అనిల్ రావిపూడి సీనియర్ హీరోలతో సినిమాలను చేస్తున్నాడు. కారణమేంటి అంటే వాళ్లతో అయితేనే అతనికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవుతూ కథలను రెడీ చేస్తున్నారు. గతంలో అనిల్ రావిపూడి రామ్ చరణ్ కి ఒక కథనైతే వినిపించారట. అతని నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన ఆ కథను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రామ్ చరణ్ ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ అనిల్ రావిపూడి సినిమా చేయడం అనేది అసాధ్యం.
కాబట్టి అతనికి డేట్స్ అయితే ఇవ్వడం లేదట. మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి పాన్ ఇండియాలో సినిమాలు చేసే స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే స్టార్ హీరోలు అతనికి డేట్స్ ఇస్తారు అనేది వాస్తవం… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట కూడా భారీ విజయాలను సాధిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగిన వాడు అవుతాడు…